AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వీడ్కోలు చెప్పలేక కన్నీళ్లు.. భారతీయ దంపతులను హత్తుకుని ఏడ్చేసిన అమెరికన్ పొరుగింటి మహిళ

అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న ఓ భారతీయ దంపతులకు వారి అమెరికన్ పొరుగింటి మహిళ ఇచ్చిన వీడ్కోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏళ్లుగా పెంచుకున్న అనుబంధాన్ని విడిపోతున్న క్షణంలో తట్టుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. దేశాలు వేరు అయినా.. మనసులు కలిస్తే ఏర్పడే బంధానికి ఈ ఘటన ఓ చక్కని ఉదాహరణగా నిలిచింది.

Watch: వీడ్కోలు చెప్పలేక కన్నీళ్లు.. భారతీయ దంపతులను హత్తుకుని ఏడ్చేసిన అమెరికన్ పొరుగింటి మహిళ
Us Neighbor Woman Emotional
Balaraju Goud
|

Updated on: Aug 15, 2026 | 12:33 PM

Share

అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న ఓ భారతీయ దంపతులకు వారి అమెరికన్ పొరుగింటి మహిళ ఇచ్చిన వీడ్కోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏళ్లుగా పెంచుకున్న అనుబంధాన్ని విడిపోతున్న క్షణంలో తట్టుకోలేక ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది. దేశాలు వేరు అయినా.. మనసులు కలిస్తే ఏర్పడే బంధానికి ఈ ఘటన ఓ చక్కని ఉదాహరణగా నిలిచింది.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ విజయ్ కొక్కెరగడ్డ తన ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. డెట్రాయిట్ విమానాశ్రయానికి బయలుదేరుతున్న సమయంలో ఈ భావోద్వేగ వీడ్కోలు చోటుచేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అమెరికాలో పొరుగువారిగా పరిచయమైన కుటుంబాల మధ్య కాలక్రమేణా ఎంతో సన్నిహితమైన స్నేహం ఏర్పడిందని తెలిపారు.

వీడియోలో భారతీయ దంపతులు తమ ఇంటి బయట నిలబడి ఉండగా.. వారి పొరుగింటి మహిళ కన్నీళ్లతో వారి వద్దకు వచ్చింది. వారిని చూడగానే గట్టిగా కౌగిలించుకుని, వారి భుజంపై తలవాల్చి ఏడ్చింది. తాను వారిని ఎంతగా మిస్ అవుతానో చెబుతూ భావోద్వేగానికి గురైంది. దంపతులు ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆమె వారిని విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు. వారు విమానాశ్రయానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనూ ఆమె భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. ఆ దృశ్యం చూసినవారిని సైతం కదిలించేలా సాగిన ఈ వీడ్కోలు క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిన మరో అంశం ఉంది. దంపతులకు తెలియకుండానే ఓ స్నేహితుడు మొత్తం వీడ్కోలు దృశ్యాన్ని వీడియోగా రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియోను వారికి చూపించడంతో.. తమ మధ్య ఉన్న అనుబంధానికి ఈ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోయేలా మారిందని విజయ్ తెలిపారు. వీడియో చూసిన నెటిజన్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు ఏర్పడిన స్నేహాలు, అక్కడి కుటుంబాలతో ఏర్పడిన అనుబంధాలను గుర్తుచేసుకున్నారు. దూరం పెరిగినా నిజమైన స్నేహం, ఆప్యాయతలు తగ్గవని పలువురు వ్యాఖ్యానించారు.

భాష, దేశం, సంస్కృతి వేర్వేరైనా.. మనుషుల మధ్య ఏర్పడే నిజమైన బంధాలకు ఎలాంటి సరిహద్దులు ఉండవని ఈ భావోద్వేగ వీడ్కోలు మరోసారి గుర్తుచేసింది.

భావోద్వేగభరిత వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. సూత్రదారులు వారేనా?
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. సూత్రదారులు వారేనా?