AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Plants for Home: ఇవి ఇంటికి అదృష్ట మొక్కలు.. సంపదకు ఎప్పటికి లోటు ఉండదు!!

ఇంట్లో మొక్కలు నాటేటప్పుడు ఎలాంటి మొక్కలు ఇంటికి అనుకూలం అనే దానిపై శ్రద్ధ పెట్టాలి. వాస్తు పరంగా, ఇంట్లో శుభప్రదమైన మొక్కలు సానుకూలతను మాత్రమే కాకుండా, ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తాయి. ఇటువంటి మొక్కలు ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతాయి. సంపదను పెంచుతాయి. అలాంటి మొక్కలను లక్కీ ప్లాంట్స్ అని పిలుస్తారు. ఇంటికి అదృష్ట మొక్కల గురించి మాట్లాడేటప్పుడు, ముందుగా గుర్తుకు వచ్చేది మనీ ప్లాంట్. కానీ మనీ ప్లాంట్ కాకుండా ఇంటికి శ్రేయస్సును తెచ్చే ఇతర మొక్కలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Lucky Plants for Home: ఇవి ఇంటికి అదృష్ట మొక్కలు.. సంపదకు ఎప్పటికి లోటు ఉండదు!!
Lucky Plants For Home
Jyothi Gadda
|

Updated on: Nov 07, 2023 | 2:08 PM

Share

ఇంటికి లక్కీ ప్లాంట్స్: ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఇంటి పెరట్లో, ఇంటిలోపల ఎక్కువగా మొక్కలు పెంచుతుంటారు. అయితే కొన్ని మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు రీత్యా ఇంటికి చాలా మేలు జరుగుతుందని మీరు తెలుసా..? అయితే కొన్ని మొక్కలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంటికి హాని కూడా కలుగుతుంది. అందుచేత ఇంట్లో మొక్కలు నాటేటప్పుడు ఎలాంటి మొక్కలు ఇంటికి అనుకూలం అనే దానిపై శ్రద్ధ పెట్టాలి. వాస్తు పరంగా, ఇంట్లో శుభప్రదమైన మొక్కలు సానుకూలతను మాత్రమే కాకుండా, ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తాయి. ఇటువంటి మొక్కలు ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతాయి. సంపదను పెంచుతాయి. అలాంటి మొక్కలను లక్కీ ప్లాంట్స్ అని పిలుస్తారు. ఇంటికి అదృష్ట మొక్కల గురించి మాట్లాడేటప్పుడు, ముందుగా గుర్తుకు వచ్చేది మనీ ప్లాంట్. కానీ మనీ ప్లాంట్ కాకుండా ఇంటికి శ్రేయస్సును తెచ్చే ఇతర మొక్కలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

లక్కీ వెదురు: వాస్తు శాస్త్రంలో లక్కీ వెదురు చాలా ముఖ్యమైనది. ఇంటి లోపల లేదా ఇంటి ముందు వెదురు మొక్కను నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ముందు వెదురు మొక్కలు నాటలేకపోతే ఇంటి లోపల కుండీల్లో పెంచుకోవచ్చు. ఈశాన్య లేదా ఉత్తర దిశలో వెదురును పెంచుకోవాలి. ఇలా చేస్తే.. త్వరలో మీరు మీ జీవితంలో గొప్ప మార్పును చూస్తారు.

దానిమ్మ: దానిమ్మ ఆరోగ్యానికి మేలు చేసే పండు మాత్రమే కాదు. ఈ మొక్క ఇంటి శ్రేయస్సుకు కూడా చాలా మంచిది. ఇంట్లో దానిమ్మ మొక్కలు పెంచుకోవటం వల్ల అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కానీ ఇంటి నైరుతి దిశలో దానిమ్మను ఎప్పుడూ నాటకూడదు.

ఇవి కూడా చదవండి

(బెర్ముడా గ్రాస్) దీనినే గరిక అని కూడా అంటారు..ఈ గరిక లేకుండా గణేశ పూజ అసంపూర్తిగా ఉంటుంది. ఇంటి ముందు గరికను నాటడం శుభప్రదం. ఇది సంపద, శ్రేయస్సును కలిగిస్తుంది. అనేక ప్రయోజనాలను తెస్తుంది.

మనీ ప్లాంట్: మనీ ప్లాంట్‌కి మనీకి మధ్య ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. చాలా ఇళ్లలో మనీ ప్లాంట్లు ఉన్నాయి. అయితే, ఈ మొక్కను సరైన స్థలంలో సరైన మార్గంలో ఉంచడం చాలా ముఖ్యం. మనీ ప్లాంట్ తీగలు ఎప్పుడు కూడా కిందికి వేలాడదీయకూడదని గుర్తుంచుకోండి. వాటికి పైకి వెళ్లేందుకు సపోర్ట్‌ ఇవ్వండి. ఎల్లప్పుడూ పైకి ఎదగడానికి సహాయం చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
బట్టతల చుట్టూ బోలెడు బిజినెస్! ఇది యాపారం భయ్యా!
బట్టతల చుట్టూ బోలెడు బిజినెస్! ఇది యాపారం భయ్యా!
సాధువు వేషం వేసి నకిలీ కొడుకు నాటకం.. చివర్లో సినీ ఫక్కీ ట్విస్ట్
సాధువు వేషం వేసి నకిలీ కొడుకు నాటకం.. చివర్లో సినీ ఫక్కీ ట్విస్ట్
విషాఖ తీరంలో విషాదం.. విహారం కోసమని వెళ్లి ముగ్గురు బాలుర గల్లంతు
విషాఖ తీరంలో విషాదం.. విహారం కోసమని వెళ్లి ముగ్గురు బాలుర గల్లంతు
మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'.. అధికారిక ప్రకటన
మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'.. అధికారిక ప్రకటన
53ఏళ్లుగా బాపూజీకి భక్తితో నిత్య పూజలు.. ఆ ఊరి జనాలకు ఆయనే దేవుడు
53ఏళ్లుగా బాపూజీకి భక్తితో నిత్య పూజలు.. ఆ ఊరి జనాలకు ఆయనే దేవుడు
గురు భక్తికి కారు బహుమతి.. పూర్వ విద్యార్థుల వినూత్న కానక
గురు భక్తికి కారు బహుమతి.. పూర్వ విద్యార్థుల వినూత్న కానక
రిటైర్మెంట్ ప్రకటించిన యుజ్వేంద్ర చాహల్
రిటైర్మెంట్ ప్రకటించిన యుజ్వేంద్ర చాహల్
మటన్ కర్రీ ఇలా చేశారంటే.. ఇంట్లో అందరి నుంచి కాంప్లిమెంట్స్ పక్కా
మటన్ కర్రీ ఇలా చేశారంటే.. ఇంట్లో అందరి నుంచి కాంప్లిమెంట్స్ పక్కా
పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. రేవంత్ సర్కార్ డెసిషన్..!
పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. రేవంత్ సర్కార్ డెసిషన్..!
‘నాకు పిల్లలు వద్దు..’ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ షాకింగ్ నిర్ణయం
‘నాకు పిల్లలు వద్దు..’ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ షాకింగ్ నిర్ణయం