AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ తాగడానికి ఎన్ని నిమిషాల ముందు నీళ్లు తాగాలో తెలుసుకోండి..? లేదంటే..

సుఖమైనా, సంతోషమైన, దుఃఖమైనా సరే.. టీ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలికేందుకు కూడా ముందుగా టీనే ఇస్తుంటాం.. ఇక్కడి ప్రజలకు టీ అంటే చాలా ఇష్టం. అయితే, ఖాళీ కడుపుతో టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, టీ తాగే ముందు నీళ్ళు తాగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... టీ లేదా కాఫీ తాగే ముందు నీళ్లు తాగితే ఏమవుతుంది.. లేదంటే, టీ తాగడానికి ఎన్ని నిమిషాల ముందు నీళ్లు తాగాలో.. ఇక్కడ తెలుసుకుందాం..

టీ తాగడానికి ఎన్ని నిమిషాల ముందు నీళ్లు తాగాలో తెలుసుకోండి..? లేదంటే..
Drinking Water
Jyothi Gadda
|

Updated on: Nov 07, 2023 | 1:47 PM

Share

చాలామందికి టీ తాగకపోతే రోజు గడవదు. టైమ్‌కు కప్పు టీ కడుపులో పడకపోతే తలనొప్పి కూడా వచ్చేస్తుంది చాలా మందికి. ఇక మన దేశంలో ఉదయం టీ తాగడం అదూ ఒక పని మాత్రమే కాదు, ఇది ప్రజల జీవితాలో ముడిపడి ఉన్న ఒక ఆహార అనుభూతి. ఇక్కడి సంస్కృతిలో టీ ఒక భాగం. మన దేశంలో ఏ సందు, మూలలో చూసినా ఒక టీ స్టాల్‌ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సుఖమైనా, సంతోషమైన, దుఃఖమైనా సరే.. టీ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలికేందుకు కూడా ముందుగా టీనే ఇస్తుంటాం.. ఇక్కడి ప్రజలకు టీ అంటే చాలా ఇష్టం. అయితే, ఖాళీ కడుపుతో టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే, టీ తాగే ముందు నీళ్ళు తాగేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే… టీ లేదా కాఫీ తాగే ముందు నీళ్లు తాగితే ఏమవుతుంది.. లేదంటే, టీ తాగడానికి ఎన్ని నిమిషాల ముందు నీళ్లు తాగాలో.. ఇక్కడ తెలుసుకుందాం..

ఖాళీ కడుపుతో తీసుకునే టీ, కాఫీ రెండూ కడుపుకు ప్రమాదకరమే. ఇది కడుపులోకి వెళ్ళినప్పుడు యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. టీ pH విలువ 6 అయితే కాఫీ pH విలువ 5. అటువంటి పరిస్థితిలో, మీరు టీ లేదా కాఫీ తాగినప్పుడు శరీరంలో అనేక ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది. అయితే టీ లేదా కాఫీ తాగే ముందు నీళ్లు తాగితే కొంతవరకు బెటర్‌ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇది ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. కాఫీ, టీలకు ముందుగా నీటిని తాగడం వల్ల టీ, కాఫీ వల్ల కలిగే హాని నుండి రక్షించే పొర పేగులో ఏర్పడుతుంది. అలాగే, బెడ్‌ టీ, లేదా ఖాళీ కడుపుతో టీ తాగడం చాలా హానికరం. ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది. ఇది దంతాలను కూడా పాడు చేస్తుంది. చాలా వరకు, ఇది దంత క్షయాన్ని కూడా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు. టీ, కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి నష్టం కల్గిస్తుంది. అందుకే టీ, కాఫీ తాగేముందు నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. టీ-కాఫీ తాగే అలవాటుంటే..అంతకంటే 15 నిమిషాల ముందు నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ అలవాటు అనేక వ్యాధుల నుంచి మీ శరీరానికి సంరక్షణ ఇస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే