Bigg Boss 7 Telugu: అమ్మ ప్రేమతో కరిగిపోయిన అశ్విని.. సలహాలతో ధైర్యమిచ్చిన తల్లి.. మనసుల్ని కదిలించిన ఎమోషనల్ సీన్ ఇది
ముందుగా శివాజీ పెద్ద కొడుకు కెన్నీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అర్జున్ అంబటి భార్య సురేఖ వచ్చింది. ఆ తర్వాత అశ్విని తల్లి రమా వచ్చింది. ఇక అమ్మను చూడగానే అశ్విని బోరున ఏడ్చేసింది. మనసులోని దిగులును తల్లి ముందు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కూతురిని ఓదారుస్తూనే ఆమెకు ధైర్యం వచ్చే సలహాలు ఇచ్చింది అశ్విని తల్లి. నీ వాళ్లు అనుకుంటున్నవాళ్లు నీ వాళ్లు కారు.. పెద్దొళ్లతోనే ఉండు అంటూ పరొక్షంగానే సలహాలు ఇచ్చింది.
ప్రస్తుతం బిగ్బాస్ ఫ్యామిలీ వీక్ సాగుతుంది. కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా ఇంట్లోకి అడుగుపెడుతున్నారు. ఇన్నాళ్లు ఫ్యామిలీకి దూరంగా ఉన్న హౌస్మేట్స్.. ఇంట్లో వాళ్లను చూడడంతో తెగ ఎమోషనల్ అయిపోయారు. నిన్నటి ఎపిసోడ్ మొత్తంలో ముగ్గురు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వచ్చారు. ముందుగా శివాజీ పెద్ద కొడుకు కెన్నీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అర్జున్ అంబటి భార్య సురేఖ వచ్చింది. ఆ తర్వాత అశ్విని తల్లి రమా వచ్చింది. ఇక అమ్మను చూడగానే అశ్విని బోరున ఏడ్చేసింది. మనసులోని దిగులును తల్లి ముందు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కూతురిని ఓదారుస్తూనే ఆమెకు ధైర్యం వచ్చే సలహాలు ఇచ్చింది అశ్విని తల్లి. నీ వాళ్లు అనుకుంటున్నవాళ్లు నీ వాళ్లు కారు.. పెద్దొళ్లతోనే ఉండు అంటూ పరొక్షంగానే సలహాలు ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్లో మాత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసింది.
నిన్నటి ఎపిసోడ్ లో చివరగా అశ్విని తల్లి అడుగుపెట్టారు. ఇంట్లో ఉన్నవాళ్లందరినీ ఫ్రీజ్ అంటూ బిగ్బాస్ చెప్పాడు. ఇక సడెన్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు అశ్విని తల్లి. నా బంగారు తల్లి.. ఎన్నిరోజులైందమ్మా నిన్ను చూడకా.. అంటూ అశ్వినిని పట్టుకొని ఎమోషనల్ అయ్యారు. తల్లిచూడగానే అశ్విని బోరున ఏడ్చేసింది. సోను (కుక్క) బాగున్నాడా అంటూ అశ్విని అడగ్గా.. బాగున్నాడు అని చెప్పింది. ఇక తర్వాత శివాజీ వచ్చి అశ్విని తల్లిని పలకరించగా.. నాకు చాలా ఇష్టం మీరంటే అంటూ హత్తుకున్నారు. భోలేకు సైతం హగ్ ఇచ్చి మీరు మా ఇంటి సభ్యుడు అయిపోయారు అంటూ ఆఫ్యాయంగా పలకరించారు. ఆ తర్వాత కూతురితో మాట్లాడుతూ.. “దేని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకు.. ఇది కేవలం గేమ్ నాన్న.. ఆడినన్ని రోజులు ఆడతాం. తర్వాత బయటకు వచ్చేస్తాం” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అశ్వినీ ఎమోషనల్ అవుతూ.. ఒక చిన్న మాట అన్నా కానీ ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
ఇక అశ్వినికి ధైర్యం ఇచ్చే సలహాలు చెప్పింది ఆమె తల్లి. నీకు ఎవరు ఇష్టమైతే వాళ్లతో కలిసుండి.. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు. వాళ్లతో కలిసుండు. మాట్లాడు.. వేరేవాళ్లతో నీకు వద్దూ అంటూ ధైర్యం చెప్పింది. ఎన్ని రోజులను భరిస్తాను మమ్మీ అంటూ ఏడ్చేసింది అశ్విని. నీకు ఎట్ల చిన్నచూపు చూస్తున్నారో ఆలోచించి నువ్వు ఇంకా పైకి వెళ్లు అని చెప్పగా.. అన్ని వదిలేసి రావాలనిపిస్తుంది కానీ నన్ను నేను ప్రూ చేసుకోవాలనుంది అంటూ ఏడ్చేసింది. ఇక టైమ్ దగ్గర పడడంతో తల్లి ఒడిలో పడుకుని గట్టిగా ఏడ్చేసింది అశ్విని. నీ వాళ్లు అని ఎవరిని అనుకుంటావో వాళ్లు నీ వాళ్లు కాదు.. ఎవరైతే కాదు అనుకుంటావో పెద్దవాళ్లు వాళ్లే న్యాయంగా ఉంటారు. బాగా మాట్లాడతారు. నీకు ఏమైనా ఉన్నా నేరుగా ఆయనతోనే (శివాజీతో) మాట్లాడు.. ఆయనతోనే ఉండు అంటూ సలహా ఇచ్చారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లోతల్లి రావడం అశ్వినికి ప్లస్ అనే చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.