నకిలీ పత్రాలతో బ్యాంకుకు టోకరా.. ఇద్దరు అరెస్ట్

నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును బురిడీ కొట్టించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నకిలీ పత్రాలతో బ్యాంకుకు టోకరా.. ఇద్దరు అరెస్ట్
Follow us

|

Updated on: Oct 01, 2020 | 7:27 AM

నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును బురిడీ కొట్టించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నకిలీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ద్వారా ఆర్‌బీఎల్‌ బ్యాంకు నుంచి రుణం తీసుకుని వాయిదాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో కేసు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.హైదరాబాద్‌ నగరానికి చెందిన మన్నెం వినోద, మన్నెం మధుకర్‌ రెడ్డి భార్యాభర్తలు. వారిద్దరితో పాటు ఎ.బాల్‌రెడ్డి, మోయిజ్‌పాషా, గుజ్జ నరసింహారెడ్డి, మరికొందరు కలిసి బ్యాంకు నుంచి రుణం పొందేందుకు 2015లో ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామం చిరునామాపై అర్జున్‌ పౌల్ట్రీఫామ్‌ పేరిట నకిలీ పత్రాలు సృష్టించారు. దానికి సంబంధించిన 2.08ఎకరాల భూమి నకిలీ పత్రాలను ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ శాఖలో సమర్పించారు. వారి పత్రాలను నమ్మిన బ్యాంకు అధికారులు రూ. 3.7కోట్లు రుణం మంజూరు చేశారు. ఆ తర్వాత కొంతవరకు చెల్లించిన నిందితులు ఆ తర్వాత నిలిపివేశారు. దీంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు ఎంక్వరీ చేయగా, అవి నకిలీ పత్రాలని నిర్ధారణకు వచ్చారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి వల్ల బ్యాంకుకు రూ. 2.72కోట్లు నష్టం వాటిల్లిందని బ్యాంకు అధికారులు తెలిపారు. అధికారులు సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు చేపట్టి.. ప్రధాన నిందితులు మన్నెం మధుకర్‌రెడ్డి, మోయిజ్‌ పాషాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
బంగారం ప్రియులకు కాస్త రిలీఫ్‌.. తులం గోల్డ్‌ ఎంతకు చేరిందంటే..
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్