Lifestyle: ఉదయం లేవగానే వికారంగా ఉంటుందా.? డేంజర్‌లో పడుతున్నట్లే

మానసిక సమస్యలతో బాధపడేవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఒక అంశం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా, ఆందోళన చెందుతుందోన్నా మార్నింగ్ సిక్‌నెస్‌నకు దారి తీస్తుండొచ్చని చెబుతున్నారు. తరచుగా అధిక ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతుంటే.. ఉదయం నిద్రలేచిన వెంటనే వికారం...

Lifestyle: ఉదయం లేవగానే వికారంగా ఉంటుందా.? డేంజర్‌లో పడుతున్నట్లే
Lifestyle
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 12, 2024 | 7:25 AM

అనారోగ్య సమస్యలు మొదలైతే వెంటనే శరీరం అలర్ట్‌ చేస్తుంది. కొన్ని లక్షణాల ఆధారంగా ఆ సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి ఒక లక్షణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే నిద్రలేవగానే మనలో కొందరికీ వికారంగా ఉంటుంది. వాంతి వచ్చిన భావన కలుగుతుంది. అయితే ఈ లక్షణం కనిపిస్తే శరీరం మిమ్మల్ని అలర్ట్‌ చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి. అవి ఎలాంటి వ్యాధులకు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

మానసిక సమస్యలతో బాధపడేవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఒక అంశం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా, ఆందోళన చెందుతుందోన్నా మార్నింగ్ సిక్‌నెస్‌నకు దారి తీస్తుండొచ్చని చెబుతున్నారు. తరచుగా అధిక ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతుంటే.. ఉదయం నిద్రలేచిన వెంటనే వికారం, వాంతుల భావన కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే యోగా మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.

ఇక లోబీపీతో బాధపడేవారిలో కూడా ఉదయాన్నే వికారం భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో బీపీ తగ్గితే వాంతితో పాటు మైకం కలుగుతున్న భావన ఉంటుందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఉదయం నిద్రలేచిన వెంటనే ఏదైనా తినాలని సూచిస్తున్నారు.

ఉదయం లేవగానే వాంతులు, వికారం సమస్య ఉంటే అది మైగ్రేన్‌ సమస్యగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన తలనొప్పితో పాటు వికారం ఉంటుంటే అది కచ్చితంగా మైక్రోన్‌కు లక్షణంగా భావించాలి. ఇక డీహైడ్రేషన్‌కు కూడా తక్కువగా నీరు తాగడం ఒక కారణంగా చెబుతుంటారు. రాత్రుళ్లు సరిపడ నీరు తాగకపోతే ఉదయాన్నే మైకం, వికారం భావన కలుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..