బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. 12 డిమాండ్ల సాదనే లక్ష్యంగా భోజనం మానేసి నిరహార నిరసన దీక్షకు దిగారు. రెగ్యూలర్ వైస్ చాన్సలర్ లేకపోవడంతో తమ గోడు వినే నాదుడే లేకుండా పోయాడని.. దేవాలయంలాంటి బాసర ట్రిపుల్ ఐటీ నాక్ హోదాలో వెనకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆరు వేల మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన శాంతియుత నిరసన నాలుగు గంటలుగా కొనసాగుతోంది. విద్యార్థులు ఉదయం టిపిన్ , మద్యాహ్నం భోజనం బహిష్కరించడంతో ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ బాట పట్టిన విద్యార్థుల తల్లిదండ్రులకు లోపలికి అనుమతి లేదంటూ ట్రిపుల్ ఐటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఆందోళన మరింత ఉదృతమవుతోంది. ప్రభుత్వం నుండి పక్కా హామీ కావాలని.. సీఎం కేసీఆర్ ఆర్జీయూకేటీని సందర్శించాలని విద్యార్థులు ప్రదానంగా డిమాండ్ చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా జ్ఞాన సరస్వతి కొలువైన బాసర లోని ఆర్జీకేయూటీ ట్రిపుల్ ఐటీలో 6 వేల మంది విద్యార్థులు హక్కుల సాదనే లక్ష్యంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. అల్పాహారం, మద్యాహ్న భోజనం మానేసి నాలుగు గంటలుగా నిరహార దీక్షను కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ను నియమించాలని మూడేళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని.. వీసీ లేక సరైన విద్య అందక నాక్ లో బాసర ఆర్జీకేయూటీ సీ గ్రేడ్ తో మరింత వెనకబడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. కొత్త అకాడమిక్ ఈయర్ ప్రారంభం అయినా ల్యాప్ టాప్ లు, యూనిఫామ్స్ ఇవ్వడం లేదని.. కనీసం ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న తమ ఆవేదన పట్టించుకునే అదికారే ట్రిపుల్ లేకుండా పోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ బాసర ట్రిపుల్ రావాలని.. వెంటనే రెగ్యూలర్ వీసీని నియమిస్తున్నట్టు ప్రటించాలని.. అప్పటి వరకు ఈ ఆందోళలను కొనసాగిస్తామని.. మా హక్కుగా దక్కాల్సిన విద్య కోసం ఎంతకైనా తెగిస్తామని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు నెరవేరేంత వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టమని మూకమ్మడి తెగేసి చెప్తున్నారు.
ఆర్జీకేయూటీ విద్యార్థుల ఆందోళనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట భారీ బందో బస్త్ ను ఏర్పాటు చేశారు. వీసీ అనుమతి లేకుండా ఎవ్వరిని ట్రిపుల్ ఐటీలోకి అనుమతించేదే లేదంటున్నారు. విద్యార్థుల నిరహార దీక్షతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటీ కి చేరుకుంటున్నారు. ట్రిపుల్ఐటీకి చేరుకున్న తల్లిదండ్రులను సైతం లోపలకి అనుమతించేదే లేదని సిబ్బంది చెప్పడంతో గేటు బయట తల్లిదండ్రులు విద్యార్థుల కు మద్దతుగా ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా గేటు ఎదుట ధర్నా చేపట్టిన బీఎస్పీ నేతలను అరెస్ట్ చేసి బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఎర్రనిఎండలో విద్యార్థుల నిరసన దీక్ష కొనసాగుతుంది. ఎండ తీవ్రతకు తట్టుకోలేక గొడుగు ల సాయంతో చెట్ల నీడలో మూకుమ్మడక నిరాహారదీక్ష ను కొనసాగిస్తున్నారు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు.