TS Inter Exams: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు ఏర్పాట్లు.. సమయం కుదింపు.!

TS Inter Exams: కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఫస్టియర్ విద్యార్ధులకు పరీక్షను రద్దు చేసి..

TS Inter Exams: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు ఏర్పాట్లు.. సమయం కుదింపు.!
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 19, 2021 | 8:21 AM

కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఫస్టియర్ విద్యార్ధులకు పరీక్షను రద్దు చేసి.. 35 శాతం మార్కులను కేటాయించగా.. సెకండియర్ విద్యార్ధులను మొదటి సంవత్సరంలోని మార్కులను ప్రాతిపదికగా తీసుకుని పాస్ చేశారు. ఇదిలా ఉంటే కొంతమంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులు తమకు కేటాయించిన 35 శాతం మార్కులపై విముఖత చూపిస్తుండటంతో.. ఎగ్జామ్స్ నిర్వహణకే విద్యాశాఖ మొగ్గు చూపిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పంపించిందట.

లాక్‌డౌన్ కారణంగా విద్యార్ధులపై ఒత్తిడి పెరగకుండా ఉండేందుకు పరీక్షల సమయాన్ని తగ్గించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గతంలో సమయం మూడు గంటలు ఉండగా.. దాన్ని గంటన్నరకు కుదించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మరోవైపు సెకండియర్ విద్యార్ధులకు ఫస్ట్ ఇయర్ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. పరీక్ష సమయాన్ని కుదించడంతో పాటు ప్రశ్నాపత్రాలను కూడా సులువుగా ఉండేలా సిద్దం చేయాలని చూస్తున్నారు. గతంలో ఫీజు చెల్లించినవారికి అవకాశం ఉండగా.. చెల్లించనివారు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై రెండు లేదా మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Also Read:

గోడ నుంచి వింత శబ్దాలు.. తీరా చూసి ఖంగుతిన్న అధికారులు.!

తవ్వకాల్లో బయటపడ్డ మనిషి పుర్రెల టవర్.. దాని హిస్టరీ తెలుసుకుని పరిశోధకులు షాక్.!

చిన్నారిపై పగబట్టిన పాము.? జెట్ స్పీడ్‌తో దూసుకొచ్చి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!