AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Femous Sakinalu: తెలంగాణ ఫేమస్ ‘సకినాలు’.. ఇలా చేస్తే రుచికరంగా వస్తాయటా… మీరు ట్రై చేయండి…

తెలంగాణలో ఎక్కువగా చేసుకునే వంటకం సకినాలు. ముఖ్యంగా వీటిని సంక్రాంతి సమయంలో బాగా చేసుకుంటారు. అంతేకాకుండా..

Telangana Femous Sakinalu: తెలంగాణ ఫేమస్ 'సకినాలు'.. ఇలా చేస్తే రుచికరంగా వస్తాయటా... మీరు ట్రై చేయండి...
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2021 | 8:49 PM

Share

తెలంగాణలో ఎక్కువగా చేసుకునే వంటకం సకినాలు. ముఖ్యంగా వీటిని సంక్రాంతి సమయంలో బాగా చేసుకుంటారు. అంతేకాకుండా.. ఇళ్ళలో జరిగే శుభకార్యాలలో చేసుకునే మొదటి వంటకం సకినాలు. పెండ్లికూతురును సాగనంపేటప్పుడు సకినాలను సారెగా పోస్తారు. అంతేకాదు..  సీమంతానికి ఒడిలో పెట్టేందుకూ సకినాలు చేస్తుంటారు. తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ ఈ సంప్రదాయం నడుస్తున్నది. చాలారోజులు నిల్వ ఉంటాయి కాబట్టి, అత్తింటికి బయల్దేరిన ఆడపడుచు.. ప్రయాణంలో పిల్లల కడుపు నింపవచ్చు! తనూ కడుపూ నింపుకోవచ్చు అంటుంటారు. మామూలుగా అయితే మూడు చుట్లతో సకినాలను చుడుతారు. కానీ ఒళ్లో పెట్టాలంటే మాత్రం.. మూడు, ఐదు, పదకొండు.. ఇలా ఆ ఇంటి ఆచారాన్ని బట్టి చుట్టల సంఖ్య పెరగవచ్చూ తగ్గవచ్చూ.  వీటిని సకినాలు, చకినాలు అని అంటారు. మరీ ఈ సకినాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా.

కావాల్సిన పదార్థాలు.. బియ్యం నీళ్లు, వాము,

నువ్వులు.

తయారీ విధానం..

బియ్యాన్ని రాత్రంతా కనీసం 5 గంటలైన నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని పట్టించాలి. పిండిని కాస్త తడి ఆరే దాకా ఎండలో పెట్టాలి. ఒక కిలో పిండికి కొలతల ప్రకారం 100 గ్రాముల నువ్వులు, వాము 10 గ్రాములు, నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలపాలి. తర్వాత దానిని ఏదైనా కాటన్ వస్త్రంలో కట్టి పిండితో గుండ్రంగా చుట్టాలి. మొత్తం సకినాల ఆకారం వచ్చేదాక చుట్టాలి. వాటిని మరుగుతున్న నూనేలో వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాక వెయించుకోవాలి. అంతే రుచికరమైన సకినాలు రెడి అయిపోతాయి. ఇక ఈ సకినాలలో ఉపయోగించే వాము కూడా జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది. సకినాల్లో ప్రధాన పదార్థం నువ్వులు. దీంట్లో పోషకాలు మెండు. ఇనుము శాతం అధికం. వీటిని తరచుగా తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. దీంట్లో అమినోయాసిడ్‌లు, మెగ్నీషియం, మాంసకృత్తులు కూడా అధికం. ఇవి రక్తపోటును నియంత్రిస్తాయి. రక్తంలోని చక్కెరస్థాయిని అదుపు చేయడంలో నువ్వుల పాత్రం గొప్పది. నువ్వులు తినడం వల్ల ఉబ్బస వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు సక్రమంగా పనిచేస్తాయి. వీటిలో సెసమాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ గుండె వ్యాధులను రానీయకుండా చేస్తుంది. లిగ్నిన్స్‌ అనే ఫైబర్‌ చెడు కొవ్వును దరిచేరనీయదు. నువ్వుల్లో ఉండే కాల్షియం మానసిక ఒత్తిడి నుంచి రక్షిస్తుంది.

Also Read:

Green Tea Benfits : ఐదు నిమిషాలు మరగబెట్టిన గ్రీన్ టీతో అద్భుత ఫలితాలు.. నగరంలో విస్తరిస్తున్న నయా ట్రెండ్