AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sexual Harassment: కామర్స్ టీచర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు 500 మంది విద్యార్థినిలపై..

విద్యా బుద్ధి నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామంతో వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు. విద్యార్థినులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Sexual Harassment: కామర్స్ టీచర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఒకరు కాదు, ఇద్దరు కాదు 500 మంది విద్యార్థినిలపై..
Sexual Harassment
Balaraju Goud
|

Updated on: May 29, 2021 | 7:40 AM

Share

Teacher Sexual Harassment: విద్యా బుద్ధి నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామంతో వెకిలిచేష్టలకు పాల్పడుతున్నారు. విద్యార్థినులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు పూర్వ విద్యార్థినులతో కలిపి మొత్తం 500 మందిని లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా ఆ ఉపాధ్యాయుడు తమను లైంగికంగా వేధించాడని, బెదిరించాడని ఆరోపించారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

తల్లిదండ్రులు తమ బిడ్డలకు జన్మనిస్తే.. ఉపాధ్యాయుడు సత్బుద్ధి, నడవడిక, నేర్పించి ప్రయోజకులను చేస్తారు. పాఠశాలకు వచ్చే పిల్లలను స‌రైన మార్గంలో న‌డిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుంది. అయితే, కొందరు ఉపాధ్యాయులు కామంతో కన్నుమిన్ను కానక, విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. తమ కోర్కెల కోసం విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తూ మానసికంగా హింసిస్తున్నారు. అలాంటిదే తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులను లైంగికంగా వేధించిన ఘటన సంచలనమైంది. దీంతో ఆ టీచర్‌పై సస్పెన్షన్ వేటు పడడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే, ఈ ఘటన మరువకముందే మరో ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. విద్యార్థులకు కామర్స్ బోధించే ఉపాధ్యాయడు కొన్ని సంవత్సారాలుగా విద్యార్థినులకు వేధిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ ఉపాధ్యాయుడి బారిన పడిన బాధితులు ఒకొక్కరిగా వచ్చి పూర్వ విద్యార్థుల సంఘాలనికి ఫిర్యాదు చేశారు. ఒకటి కాదు రెండు కాదు 500 మంది విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు విద్యార్థుల సంఘం ప్రతినిధులు పాఠశాల యాజమాన్యానికి తెలిపారు. దీంతో వెంటనే అతడిని పాఠశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడించింది.

ఈ విషయాన్ని పూర్వ విద్యార్థుల సంఘానికి పాఠశాల యాజమాన్యం ఈ మెయిల్ ద్వారా తెలిపింది. పాఠశాల యాజమాన్య కొంత ఆందోళనకు గురై ఉపాధ్యాయుడిపై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది. వెంటనే విచారణ కోసం అంతర్గత కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. కమిటీ నిజనిజాలను తెలుసుకొని విచారణను పూర్తి పారదర్శకంగా జరిపేట్లు ఆదేశించినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఇటువంటి ఘటనలు ఎప్పటికీ క్షమించరానివని అన్నారు. ఫిర్యాదు చేసిన వారు ఆ కీచక ఉపాధ్యాయుడు తమను లైంగికంగా వేధించడమే కాకుండా.. బెదిరించేవాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ ఉపాధ్యాయుడు తమను దగ్గరకు తీసుకొని ఒళ్లో కూర్చోబెట్టుకునే వాడని, అంతేకాకుండా ఎక్కడపడితే అక్కడ తాకుతూ ముద్దులు పెట్టేవారని వాపోయారు. ఏంటి సార్ ఇలా చేస్తున్నారు.. ఇంట్లో మా తల్లిదండ్రులకు చెబుతామంటే పరీక్షలో ఫెయిల్ చేస్తానని బెదిరించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో పాటు అత్యాచారం, నేరపూరిత బెదిరింపులు తదితర కేసులు నమోదు చేయాలని బాధిత బాలికలు డిమాండ్ చేస్తున్నారు.

Read Also…  Woman Constable Raped: కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్.. యాస్ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడి