Building Collapsed: థానేలో ఘోరం.. కూలిన భవనం పైకప్పు.. ఏడుగురు దుర్మరణం..
Building Collapsed in Thane: మహారాష్ట్రలోని థానే పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. థానేలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి ఓ బిల్డింగ్ పైకప్పు అకస్మాత్తుగా
Building Collapsed in Thane: మహారాష్ట్రలోని థానే పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. థానేలోని ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం రాత్రి ఓ బిల్డింగ్ పైకప్పు అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదారుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు భవనం శిథిలాల నుంచి ఏడు మృతదేహాలు వెలికి తీసినట్లు థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇంకా ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
ఉల్లాస్‌నగర్‌లోని నెహ్రూచౌక్ వద్ద ఉన్న ఓ భవనం ఐదో అంతస్థు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. రాత్రి 9.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపకశాఖ సిబ్బంది, పోలీసులు, విపత్తు దళాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, శిథిలాల కింద ఇంకా ఎంత మంది చిక్కుకున్నారో తెలియలేదని అధికారులు తెలిపారు.
Also Read: