Woman Constable Raped: కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్.. యాస్ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడి

ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ పోలీసు.. విధుల్లో ఉన్న తోటి ఉద్యోగినిపై దారుణానికి ఒడిగట్టాడు.

Woman Constable Raped: కామంతో కళ్లు మూసుకుపోయిన పోలీస్.. యాస్ విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై లైంగికదాడి
Follow us
Balaraju Goud

|

Updated on: May 29, 2021 | 7:11 AM

Police Arrested for Raping Woman Constable ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ పోలీసు.. విధుల్లో ఉన్న తోటి ఉద్యోగినిపై దారుణానికి ఒడిగట్టాడు. యాస్ తుఫాను డ్యూటీపై అవుట్‌పోస్టు వద్ద ఉన్న మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఒడిశా పోలీసులు గోపాల్‌పూర్ పోలీసు ఔట్‌పోస్టు అధికారిని అరెస్టు చేశారు.

ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడ్డ యాస్ తుఫాను కారణంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు గోపాల్‌పూర్ వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. మహిళా కానిస్టేబుల్ యాస్ తుఫాను నేపథ్యంలో విధుల్లో నిమగ్నమై ఉన్నారు. బన్సిధర్ ప్రధాన్ అనే సహా ఉద్యోగి మొదట తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తరువాత ఆమెపై అత్యాచారం చేశాడని మహిళా కానిస్టేబుల్ ఆరోపించింది. ఈ మేరకు మహిళా కానిస్టేబుల్ నిందితుడిపై శుక్రవారం బాలసోర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు బన్సిధర్ ప్రధాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ‌

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా బాలసోర్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపుతామని బాలసోర్ ఎస్పీ సుధాన్షు శేఖర్ మిశ్రా తెలిపారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

Read Also… Non Veg Sales Bans: మాంసం ప్రియులకు ఊహించని షాక్.. ఆదివారం మాంసం దుకాణాలు బంద్.. కారణం అదేనా..?