రేప్ ఆరోపణలు..చిక్కుల్లో బీజేపీ నేత స్వామి చిన్మయానంద

రేప్ ఆరోపణలు..చిక్కుల్లో బీజేపీ నేత స్వామి చిన్మయానంద

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద తనపై ఏడాదికాలంగా లైంగికంగా వేధిస్తూ వచ్చాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని యూపీలో ఓ లా కాలేజీ విద్యార్థిని ఆరోపిస్తోంది. తన ఒంటిని మాసేజ్ చేయాల్సిందిగా చిన్మయానంద కోరాడంటూ బాధితురాలు విడుదల చేసినట్టు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. తన కళ్ళద్దాల్లో ఫిక్స్ చేసిన స్పై కెమెరా ద్వారా బాధితురాలు ఈ వీడియోను షూట్ చేసిందని ఓ మీడియా వెబ్ సైట్ పేర్కొంది. ఈ వీడియో […]

Anil kumar poka

|

Sep 11, 2019 | 1:19 PM

మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద తనపై ఏడాదికాలంగా లైంగికంగా వేధిస్తూ వచ్చాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని యూపీలో ఓ లా కాలేజీ విద్యార్థిని ఆరోపిస్తోంది. తన ఒంటిని మాసేజ్ చేయాల్సిందిగా చిన్మయానంద కోరాడంటూ బాధితురాలు విడుదల చేసినట్టు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. తన కళ్ళద్దాల్లో ఫిక్స్ చేసిన స్పై కెమెరా ద్వారా బాధితురాలు ఈ వీడియోను షూట్ చేసిందని ఓ మీడియా వెబ్ సైట్ పేర్కొంది. ఈ వీడియో క్లిప్ ని ఆమె కుటుంబ సభ్యులు ‘ సిట్ ‘ అధికారులకు అందజేశారు. కాగా-షాజహాన్ పూర్ లో బాధితురాలు ఉంటున్న హాస్టల్లోని ఆమె గదిని వారు చాలాసేపు సెర్చ్ చేశారు. ఈ వీడియో క్లిప్ నిజమైందా లేక ఫేక్ వీడియో అన్నదానిపై వారింకా ఓ నిర్ధారణకు రావాల్సి ఉంది. అయితే తన క్లయింటుపై బాధితురాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఈ వీడియో అన్నది బూటకమని స్వామి చిన్మయానంద తరఫు లాయర్ ఓంసింగ్ అంటున్నారు. చిన్మయానంద ప్రతిష్టను దిగజార్చడానికే ఈ ప్రయత్నమని ఆయన ఖండించాడు. మరోవైపు.. చిన్మయానందపై రేప్ కేసు పెట్టేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారని బాధితురాలు మీడియా వద్ద వాపోయింది. ఈ నెల 8 న ఖాకీలు సుమారు 11 గంటల పాటు తనను ప్రశ్నించారని, అయినా వారు 72 ఏళ్ళ ఈ ‘ స్వామి ‘ మీద కేసు పెట్టడానికి సందేహిస్తున్నారని ఆమె వారిని దుయ్యబట్టింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu