హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం

హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 11, 2019 | 1:31 PM

హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణస్వీకారోత్సవంలో హిమాచల్ ప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబించేలా దత్తాత్రేయ టోపీని ధరించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu