సుశాంత్ వీరాభిమాని ఆత్మహత్య… కన్నీరు పెట్టిస్తోన్న సూసైడ్ నోట్.!

సుశాంత్ వీరాభిమానులు తమ హీరో లేరన్న చేదు నిజాన్ని తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బైర్లీకి చెందిన సుశాంత్ డైహర్డ్ ఫ్యాన్..

సుశాంత్ వీరాభిమాని ఆత్మహత్య... కన్నీరు పెట్టిస్తోన్న సూసైడ్ నోట్.!
Ravi Kiran

|

Jun 17, 2020 | 11:02 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ జూన్ 14న బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. ఈ మరణవార్తతో యావత్ దేశమంతా తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. డిప్రెషన్ వల్లే ఆయన సూసైడ్ చేసుకున్నారని కొందరు అంటుంటే.. మరికొందరు బాలీవుడ్ నెపోటిజం సుశాంత్‌ను చంపేసిందని ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉంటే సుశాంత్ వీరాభిమానులు కొందరు తమ హీరో లేరన్న చేదు నిజాన్ని తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బైర్లీకి చెందిన సుశాంత్ డైహర్డ్ ఫ్యాన్ అయిన 10వ తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ కఠిన నిర్ణయం తీసుకునే ముందు, అతడు ఒక సూసైడ్ నోట్ వదిలేసినట్లు తెలుస్తోంది. అందులో ‘IF HE CAN DO IT, WHY CAN’T I’ అని పేర్కొన్నాడు. అటు పాట్నాకు చెందిన ఒక అమ్మాయి కూడా సుశాంత్ మరణవార్త తట్టుకోలేక మరణించినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. కాగా, సుశాంత్ మరణంపై బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ తో పాటు మరో 8 మందిపై కేసులు నమోదయ్యాయి. బీహార్ కు చెందిన సుధీర్ కుమార్ ఓజా అనే లాయర్ వారిపై కేసులు పెట్టారు. సుశాంత్ సూసైడ్ కు బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులే కారణమంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

Also Read:

బ్రేకింగ్: సుశాంత్ కుటుంబంలో మరో విషాదం..

‘సుశాంత్‌పై కపట ప్రేమ చూపిస్తున్నారు’.. నెపోటిజంపై సైఫ్ ఫైర్..

సుశాంత్‌ను చంపింది వాళ్లే.. కంగనా సంచలన వ్యాఖ్యలు..

View this post on Instagram

This is Just In! Saddened by Sushant Singh Rajput’s demise, one of his fans, a student takes his life by hanging himself in his house in Bihar #justin #sad #SushantSinghRajput #sushantsinghrajputfans #bollywood #bollywoodactor #bollywoodceleb #bollywoodcelebrity #bollywoodnews #bollywoodmovie #etimes #entertainmenttimes

A post shared by ETimes (@etimes) on

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu