AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రిన్సిపల్ సస్పెండ్..! ఆందోళన ఉధృతం..

అకారణంగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారని వందల మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ కు మద్దతుగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది‌. ప్రిన్సిపాల్ ను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు ఆందోళన విరమించమంటూ విద్యార్థులు తెగేసి చెప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా పరిస్థితి సద్దుమణిగకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ స్పందించి న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

గురుకుల విద్యార్థుల ఫైటింగ్‌ వీడియో వైరల్‌.. సీన్ కట్ చేస్తే ప్రిన్సిపల్ సస్పెండ్..! ఆందోళన ఉధృతం..
Gurukul School Violence
Naresh Gollana
| Edited By: |

Updated on: Feb 18, 2025 | 2:50 PM

Share

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పై తోటి విద్యార్థుల దాడి ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత వారం రోజుల క్రితం మనోజ్ గౌడ్ అనే పదవ తరగతి విద్యార్థిపై అదే తరగతి చదువుతున్న మరో ఏడుగురు విద్యార్థులు విచక్షణా రహితంగా దాడి చేసి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసి మరీ పైశాచికానందం పొందడం హాట్ టాపిక్ గా మారింది. బాదిత విద్యార్థి ఎట్టకేలకు తల్లిదండ్రులకు గోడు వెళ్లబోసుకోవడంతో వారం తర్వాత ఘటన వెలుగు చూసింది. విద్యార్థి సంఘాల నేతలతో సోమవారం ఉదయం హాస్టల్ ఎదుట బాదిత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో ఇష్యూ సీరియస్ గా మారింది. ఎట్టకేలకు విషయం తెలుసుకున్న విద్యాశాఖ ఉన్నతాదికారులు చర్యలు చేపట్టడంతో సీన్ రివర్స్ అయింది.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహాత్మా గాంధీ జ్యోతి బాపులే పాఠశాలలో విద్యార్థుల దాడి ఘటన నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. పాఠశాల ప్రిన్సిపాల్ కేవీఎం ప్రకాశ్ ను బాధ్యుడిని‌ చేస్తూ సాయంత్రం సస్పెండ్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. వెంటనే విధుల నుండి తప్పుకోవాలని తెలుగు లెక్చరర్‌ రాజ్ కుమార్ ను ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ గా కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపాల్ సస్పెండ్ విషయం తెలుసుకున్న హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగడం తో ఘటన మరో మలుపు తిరిగింది.

అకారణంగా ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేశారని వందల మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ కు మద్దతుగా రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది‌. ప్రిన్సిపాల్ ను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు ఆందోళన విరమించమంటూ విద్యార్థులు తెగేసి చెప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా పరిస్థితి సద్దుమణిగకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ స్పందించి న్యాయం చేస్తానంటూ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థులు ఆందోళన చేపట్టడానికి గల కారణాలను తెలుసుకొని ఆందోళనలకు ప్రేరేపించిన వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే వివేక్. విద్యార్థి పై దాడికి కారణమైన విద్యార్థులపై సైతం చర్యలు తీసుకోవాలని అదికారులను కోరారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ