Hyderabad: ఏరా.! మీరు మారరా.. ORRపై లగ్జరీ కార్లతో డెత్ స్టంట్‌లు.. సీన్ కట్ చేస్తే
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు రెండు లగ్జరీ కార్లతో స్టంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్ధులను శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయంటే..

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లతో స్టంట్లు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఔటర్ రింగ్ రోడ్డుపై 120 స్పీడ్‌తో వీరిద్దరూ వాహనాలను పోనిచ్చి స్టంట్లు చేశారు. దీంతో జనాలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలాగే పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఇక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకునేలోపే ఆకతాయిలు అక్కడ నుంచి పరారయ్యారు. అయితే సీసీటీవీలో రికార్డయిన ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయంపై శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ నాంపల్లి ప్రాంతానికి చెందిన మహమ్మద్ అబ్దుల్లా అన్సారి, జహీర్ సిద్ధికీ కలిసి తన ముగ్గురు స్నేహితులతో ఫార్చునర్, బిఎండబ్ల్యూ కార్లలో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతున్నారు. వీరు ఈ రెండు కార్లతో రోడ్డుపై స్టంట్‌లు వేస్తూ నానా హంగామా సృష్టించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుంటుండగానే వారు పరారయ్యారు. వారు నడుపుతున్న రెండు కార్లకు నెంబర్ ప్లేట్లు తొలగించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుని.. వారు వాడిన రెండు కార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు. ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్డుపై రెచ్చిపోయి ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి
