AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాదం.. కేసు వాదిస్తూనే గుండెపోటుతో న్యాయవాది మృతి!

మనిషి గుండె ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆగుతుందో అర్థం కావడం లేదు. రీసెంట్ టైమ్స్‌లో హర్ట్ ఎటాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా.. కళ్లముందే కుప్పకూలి ప్రాణాలిడుస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే రెండు చోట్ల జరిగిన విషాద ఘటనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గుండెపోటు వస్తే అంతే.. స్పాట్‌లో ప్రాణాలు పోవాల్సిందే. వరుస ఘటనలు చూస్తే ఇదే నిజమనిపిస్తోంది.

Hyderabad: తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాదం.. కేసు వాదిస్తూనే గుండెపోటుతో న్యాయవాది మృతి!
Telangana High Court
Balaraju Goud
|

Updated on: Feb 18, 2025 | 5:36 PM

Share

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. రెప్పపాటులో ప్రాణం పోతుంది. – అప్పటిదాకా అందరితో సరదా ఉంటూ, కోర్టులో కేసు వాదిస్తున్నారు. ఇంతలోనే ఒక్కసారిగా కేసు వాదిస్తూనే కుప్పకూలిపోయాడు. హుటాహుటీన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రముఖ న్యాయవాది పసునూరి వేణుగోపాల్ రావు మృతి చెందిన ఘటన తెలంగాణ హైకోర్టులో జరిగింది.

తెలంగాణ హైకోర్టులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం (ఫిబ్రవరి 18) హైకోర్టు 21వ కోర్టు హాల్‌లో న్యాయమూర్తి ముందు ఓ కేసులో తన వాదనలు వినిపిస్తున్నారు వేణుగోపాల్ రావు అనే న్యాయవాది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఛాతీలో నొప్పితో కుప్పకూలిపోయాడు. కేసు వాదిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో, అక్కడే ఉన్న తోటి న్యాయవాదులు వెంటనే స్పందించి, హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయనను పరిశీలించించిన వైద్యులు.. వేణుగోపాల్ రావు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు.

ఈ హఠాత్తు పరిణామంతో తెలంగాణ హకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు షాక్ అయ్యారు. కేసు వాదిస్తూనే ప్రాణాలు కోల్పోయిన అడ్వకేట్ వేణుగోపాల్ రావు మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే సంతాప సూచకంగా హైకోర్టులోని అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపివేశారు న్యాయమూర్తులు. అన్ని కోర్టుల్లో విచారణలు ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేశారు.

కాగా.. ఇటీవల గుండెపోటు.. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వృద్ధులకే కాదు నడివయస్కులకు, యువతతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు. కూర్చొన్న చోటే కూర్చుకున్నట్టుగానే.. నిలబడి ఉంటే అక్కడే.. డ్యాన్స్ చేస్తూ చేస్తూనే.. ఇలా ఎక్కడివాళ్లు అక్కడే.. క్షణాల్లో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేస్తున్నారు. అప్పటివరకు ఎంతో యాక్టివ్‌గా ఉండి.. ఉన్నట్టుండి ప్రాణాలు వదిలేస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..