HMPV Virus: చైనా వైరస్‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.10 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
HMPV Virus: పీఎస్‌యూ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో భారీ క్షీణత కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, కెనరా బ్యాంక్‌లు 4 శాతానికి పైగా క్షీణించాయి. దిగ్గజాలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), కోటక్ మహీంద్రా బ్యాంక్‌లలో కూడా పెద్ద క్షీణత ఉంది. ఈ HMPV వైరస్ కారణంగా స్టాక్
చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా చైనాలో HMPV వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ భారత్‌కు వ్యాప్తించడంతో ఆందోళన మొదలైంది. బెంగళూరులో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లో కలకలం రేగింది. సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ దాదాపు 1.4 శాతం పడిపోయింది. ఈ పతనం కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు రూ.10 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి.
పీఎస్‌యూ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ స్టాక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో భారీ క్షీణత కనిపిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, కెనరా బ్యాంక్‌లు 4 శాతానికి పైగా క్షీణించాయి. దిగ్గజాలు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), కోటక్ మహీంద్రా బ్యాంక్‌లలో కూడా పెద్ద క్షీణత ఉంది. ఈ HMPV వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లో ఎలాంటి క్షీణత కనిపిస్తుందో కూడా చూద్దాం..
చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ ఇప్పుడు భారత్‌కు చేరడంతో ఆందోళల నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కర్ణాటకలోని బెంగళూరు నగరంలో రెండు కేసులు నిర్ధారించిన తర్వాత, స్టాక్ మార్కెట్లో పెద్ద పతనం కనిపిస్తోంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్ల మేర క్షీణించింది. దీంతో సూచీ 77,959.95 పాయింట్లకు పడిపోయింది. కాగా ఈ ఉదయం స్వల్ప పెరుగుదలతో 79,281.65 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
భారత స్టాక్ మార్కెట్ పతనానికి అనేక కారణాలున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు విక్రయించడం నుండి ముడి చమురు ధరల పెరుగుదల వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. నివేదికలు ప్రకారం.. చైనా HMPV వైరస్ ప్రభావం సోమవారం మార్కెట్లో క్షీణత రూపంలో కనిపించింది. బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో రెండు చైనీస్ HMPV వైరస్ కేసులను గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ధృవీకరించిన తర్వాత, పెట్టుబడిదారులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో వైరస్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడింది.
ఇది కూడా చదవండి: New SIM Card Rules: ఇలాంటి వారు మూడేళ్ల వరకు సిమ్ కార్డ్ తీసుకోలేరు.. బ్లాక్ లిస్ట్‌లోనే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి