Redmi 14C: సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ.. ఆ వివో ఫోన్‌కు గట్టి పోటీ

భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో చాలా కంపెనీలు రూ.15 వేల కంటే తక్కువ ధరలోనే ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఎంఐ వివో కంపెనీ ఫోన్ టీ3ఎక్స్ పోటీనిచ్చేలా రెడ్ మీ 14 సీ లాంచ్ చేస్తుంది.

Redmi 14C: సూపర్ ఫీచర్స్‌తో నయా ఫోన్ రిలీజ్ చేసిన రెడ్‌మీ.. ఆ వివో ఫోన్‌కు గట్టి పోటీ
Redmi 14c
Follow us
Srinu

|

Updated on: Jan 07, 2025 | 5:15 PM

ఎంఐ కంపెనీ 2025వ సంవత్సరంలో తన మొదటి స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మీ 14సీని మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ రెడ్ మీ 13 సీ సక్సెసర్‌గా లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్‌తో ఆధారంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఫోటోలు, వీడియోల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న వీవో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు గట్టి పోటీని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

రెడ్‌మీ 14సీ మూడు వేరియంట్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్ దీని ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్‌తో వనిల్లా వేరియంట్ ధర రూ.9,999గా నిర్ణయించారు. 4జీబీ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999గా ఉంటే 6జీబీ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో దాని వేరియంట్ ధర రూ.11,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ సేల్ జనవరి 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ను ఎంఐ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్‌తో పాటు 33 వాట్స్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. ముఖ్యంగా అధునాతన ఏఐ ఫీచర్లు ఆకట్టుకుంటాయిన ఎంఐ ప్రతినిధులు చెబుతున్నారు. 

రెడ్‌మీ 14సీ 5 జీ ఫోన్‌ను లాంచ్  కొద్ది రోజుల ముందు వివో తన ప్రసిద్ధ టీ3ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు భారతదేశంలో వివో టీ3ఎక్స్ ధరను రూ. 1,000 తగ్గించింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.12,499గా ఉంది. వివో టీ3 ఎక్స్ స్నాప్ డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లోని ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్‌. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ, వీడియో కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి