AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Visa: భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!

US Visa: ఎప్పటినుంచో హెచ్ 1 బీ వీసాదారులు ఎదురుచూస్తున్న తరుణం భారతీయులకు రానే వచ్చింది. హెచ్ 1 బీ వీసాల రెన్యువల్ ప్రక్రియలో ఎప్పటినుంచో చూస్తున్న ఊరటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వివరాలను వెల్లడించింది..

US Visa: భారతీయులకు భారీ గుడ్‌న్యూస్.. అమెరికా సంచలన నిర్ణయం!
Subhash Goud
|

Updated on: Jan 07, 2025 | 5:50 PM

Share

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. ‘హెచ్-1బీ’ వీసా రెన్యువల్ కోసం అమెరికా ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఇప్పుడు స్వదేశానికి రాకుండానే అమెరికాలో భారతీయలు తమ వీసా రెన్యువల్ చేసుకోవచ్చు. అమెరికా త్వరలో వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోందని, దీని కింద H-1B వీసా హోల్డర్లు దేశం విడిచి వెళ్లకుండానే తమ పత్రాలను పునరుద్ధరించుకోవచ్చని న్యూఢిల్లీలోని US ఎంబసీ తెలిపింది.

H-1B వీసా హోల్డర్ల కోసం యూఎస్‌ ఆధారిత పునరుద్ధరణ కార్యక్రమం ఈ సంవత్సరం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వివిధ రకాల నిపుణులు, భారతీయ కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తమ వీసాను పునరుద్ధరించడానికి ఇంటికి తిరిగి రావాల్సి వస్తుంటుంది. H-1B వీసాలను రెన్యూవల్‌, రీఫిల్ చేయడానికి భారతదేశానికి తిరిగి రావడం USలో నివసిస్తున్న భారతీయ కార్మికులకు చాలా కాలంగా ఆందోళన కలిగిస్తుంది.

H-1B వీసాలను పునరుద్ధరించే పైలట్ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఇది సాధ్యమైందని US ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పైలట్ ప్రోగ్రామ్ వేలాది మంది దరఖాస్తుదారుల వీసాలను పునరుద్ధరించింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ, అమెరికాలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి మూడు వారాల ముందు ‘H-1B’ వీసాపై చర్చ జరుగుతోంది. దీని కారణంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలలో విభేదాలు తలెత్తాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రంప్‌ H-1B వీసాకు మద్దతు ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: Tech Tips: మీ మొబైల్‌ని ఫుల్ చార్జింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?