ఆనందనిలయం దాటనున్న శ్రీవారు.. టీటీడీ కీలక నిర్ణయం

బ్రహ్మాండ నాయకుడు ఆనందనిలయం దాటనున్నాడు. తిరుమలేశుడు ఆలయం వెలుపలికి రానున్నాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల ఆలయం దాటి బయటికి రాబోతున్నాడు.

  • Rajesh Sharma
  • Publish Date - 7:02 pm, Tue, 27 October 20
ఆనందనిలయం దాటనున్న శ్రీవారు.. టీటీడీ కీలక నిర్ణయం

Srivaru to come out from Ananda nilayam:  బ్రహ్మాండ నాయకుడు ఆనందనిలయం దాటనున్నాడు. తిరుమలేశుడు ఆలయం వెలుపలికి రానున్నాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల ఆలయం దాటి బయటికి రాబోతున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మలయప్ప స్వామి నవంబర్ 1వ తేదీ నుంచి ఆనంద నిలయం నుంచి బయటికి రాబోతున్నాడు.

కరోనా ప్రబావం కారణంగా ఏడు నెలలుగా ఆనంద నిలయానికే పరిమితమైన దేవదేవున్ని భక్తుల దర్శనార్థం నవంబర్ 1వ తేదీ నుంచి బయటికి తీసుకురాబోతున్నారు. ఏడు నెలల తర్వాత బయటికి రానున్న మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ సేవను ఆలయం వెలుపల నిర్వహించాలని టీటీడీ ట్రస్టు బోర్డు మంగళవారం నిర్ణయించింది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు వర్చువల్ విధానంలో చేయాలని టీటీడీ నిర్ణయించింది.

కోవిడ్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో టీటీడీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆర్జిత సేవల్లో పాల్గొనదలచిన భక్తులు టికెట్ రుసుం చెల్లించి ఎస్వీబీసీ లైవ్ ద్వారా సాంప్రదాయ వస్త్రాల్లో వీక్షించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే నిర్వహిస్తున్న వర్చువల్ కళ్యాణోత్సవానికి విశేష స్పందన లభించడంతో మరిన్ని సేవలకు వర్చువల్ విధానంలో నిర్వహించాలని టీటీడీ భావించింది. తాజాగా మూడు సేవలను వర్చువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది.

Also read: సెకెండ్‌వేవ్ కరోనా మరింత డేంజర్.. వైద్యవర్గాల వార్నింగ్

Also read: ఇండియా, అమెరికా ‘బెకా‘ డీల్… హైలైట్స్ ఇవే

Also read: తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు

Also read: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం

Also read: ధోనీ అభిమానులకు శుభవార్త.. సీఎస్కే కీలక ప్రకటన

Also read: కాబూల్‌లో బాంబ్ బ్లాస్ట్