ఇండియా, అమెరికా ‘బెకా‘ డీల్… హైలైట్స్ ఇవే

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బెకా అగ్రిమెంటుపై భారత్, అమెరికా దేశాలు సంతకం చేశాయి. మంత్రుల స్థాయిలో మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఇరు దేశాల ప్రతినిధుల భేటీలో బెకా…

  • Rajesh Sharma
  • Publish Date - 3:53 pm, Tue, 27 October 20

India America signed BECA agreement: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బెకా అగ్రిమెంటుపై భారత్, అమెరికా దేశాలు సంతకం చేశాయి. మంత్రుల స్థాయిలో మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఇరు దేశాల ప్రతినిధుల భేటీలో బెకా (బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంటు)పై ఇరు దేశాల ప్రతినిధులు సంతకం చేశారు. దీంతో అమెరికాతో భారత దేశానికి నాలుగు ముఖ్యమైన రక్షణ రంగ సహకార ఒప్పందాల ప్రక్రియ పూర్తి అయినట్లయ్యింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు ఇకపై జియోస్పాషియల్ సమాచారం, హై-ఎండ్ మిలిటరీ టెక్నీలజీ, క్లాసిఫైడ్ శాటిలైట్ డేటాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటాయి. ఈ ఒప్పందంపై భారత దేశం తరపున రక్షణ శాఖ అదనపు కార్యదర్శి జీవేశ్ నందన్ సంతకం చేశారు.

బెకా ఒప్పందాన్ని స్వాగతించిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇకపై ఇరు దేశాలు సంయుక్తంగా మూడో ఇతర దేశంలో సైతం మిలిటరీ యాక్టివిటీస్ నిర్వహించే సాధ్యాసాధ్యాలను ఇరు దేశాలు పరిశీలిస్తున్నాయని వెల్లడించారు. బెకా ఒప్పందం గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ముఖ్యమైనదని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ వ్యాఖ్యానించారు.

తాజా ఒప్పందం ద్వారా భారత దేశానికి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పసిఫిక్ మహాసముద్రంపై పట్టు దక్కే అవకాశాలున్నాయి. ఒకవైపు చైనా దూకుడును ప్రదర్శిస్తున్న సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో దాని యాక్టివిటీస్‌ను నిరంతరం పరిశీలించే వెసులుబాటు భారత దేశానికి దక్కనుంది. చైనా వంటి దేశాలతో భారత దేశానికి పొంచి వున్న ముప్పు విషయంలో అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైఖేల్ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ముప్పు ఎదురైనా అమెరికా భారత్‌కు అండగా నిలుస్తుందని ఆయన హమీ ఇచ్చారు.

Also read: సెకెండ్‌వేవ్ కరోనా మరింత డేంజర్.. వైద్యవర్గాల వార్నింగ్

Also read: తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు

Also read: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం

Also read: ధోనీ అభిమానులకు శుభవార్త.. సీఎస్కే కీలక ప్రకటన