సెకెండ్‌వేవ్ కరోనా మరింత డేంజర్.. వైద్యవర్గాల వార్నింగ్

గత వారం, పది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్న కరోనా వైరస్ భవిష్యత్తులో మరోసారి విజృంభించ వచ్చంటున్నారు నిఫుణులు. దీనినే సెకెండ్ వేవ్‌గా పిలుస్తున్నారు నిఫుణులు. సెకెండ్ వేవ్ ఎప్పుడు మొదలవుతుందో అంఛనా వేసి చెబుతున్నారు.

సెకెండ్‌వేవ్ కరోనా మరింత డేంజర్.. వైద్యవర్గాల వార్నింగ్
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: Oct 28, 2020 | 11:08 PM

Second wave of corona is more dangerous: గత వారం, పది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్న కరోనా వైరస్ భవిష్యత్తులో మరోసారి విజృంభించ వచ్చంటున్నారు నిఫుణులు. దీనినే సెకెండ్ వేవ్‌గా పిలుస్తుండగా.. దాని ప్రభావం త్వరలోనే దేశంలో కనిపిస్తుందని అంఛనా వేస్తున్నారు.

పదిహేను రోజుల క్రితం దేశంలో రోజూవారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేలల్లో నమోదయ్యేది.. అది క్రమంగా తగ్గుతూ వస్తూ.. ప్రస్తుతం 40 వేలలో కేసులు ప్రతీ రోజు నమోదవుతున్నాయి. మరణాల రేటు తగ్గుతోంది. పాజిటివ్ కేసుల శాతం తగ్గుతోంది. ఈ నెంబర్లను ఫాలో అవుతున్న వారిలో క్రమేపీ కరోనా పట్ల నిర్లక్ష్యం ఆవహిస్తోంది. ఫలితంగా మాస్కులు లేని మనుషుల సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ టెండెన్సీ ప్రమాదమంటున్నారు నిఫుణులు.

దేశంలో సెకెండ్ వేవ్ కరోనా వైరస్ మరో 3, 4 వారాల్లో ప్రారంభమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. నవంబర్ మూడు, నాలుగు వారాల్లో లేదా డిసెంబర్‌ మొదటి వారంలో కరోనా వైరస్ ఉధృతి మరోసారి పెరగ వచ్చని అంచనా వేస్తున్నారు. ఏ వైరస్ అయినా రెండో సారి విజృంభిస్తే దాని ప్రభావం తీవ్రంగా వుంటుందని వైద్యవర్గాలు హెచ్చరిస్తున్నాయి.

అన్ లాక్ 5.0లో భాగంగా ప్రారంభమైన యాక్టివిటీస్‌లో ప్రజలు ఏ మేరకు ముందు జాగ్రత్తలు పాటించారనే విషయంపై సెకెండ్ వేవ్ తీవ్రత ఆధారపడి వుంటుందంటున్నాయి వైద్య వర్గాలు. దానికి తోడు పండుగల సీజన్ కూడా కావడంతో ప్రజల్లో ముందు జాగ్రత్తలపై నిర్లక్ష్యం ఆవహించినట్లు కనిపిస్తోందని చెబుతున్నారు.

కరోనా వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రానందున ముందు జాగ్రత్తలు అత్యంత అనివార్యమంటున్నారు నిఫుణులు. కొందరు కరోనా అధ్యాయం ముగిసిందనే గుడ్డినమ్మకంతో మాస్క్‌లు ధరించడం లేదు.. సామాజిక దూరం, శానిటైజేషన్‌ లాంటి జాగ్రత్తలు పాటించడం మానేశారని.. అందువల్ల దేశంలో సెకెండ్ వేవ్‌కు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని వారు వివరిస్తున్నారు. దానికి తోడు వచ్చేది చలికాలం కావడంతో వైరస్ తీవ్రత మరింత ఎక్కువగా వుండే ప్రమాదం వుందంటున్నారు.

Also read: ఇండియా, అమెరికా ‘బెకా‘ డీల్… హైలైట్స్ ఇవే

Also read: తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు

Also read: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం

Also read: ధోనీ అభిమానులకు శుభవార్త.. సీఎస్కే కీలక ప్రకటన

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..