AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Ketaki Sangameshwara Temple: శివయ్యని బ్రహ్మదేవుడే మొగలి పువ్వులతో పూజించిన క్షేత్రం.. ఇక్కడ కుండంలో స్నానంచేస్తే చర్మ వ్యాధులు దూరం అంటూ నమ్మకం

శివశివా అంటూ మనసారా తలచుకుంటూ.. జలంతో అభిషేకించినా కోరిన కోర్కికలు తీర్చే భోళాశంకరుడు.. శివుడు. దేశ వ్యాప్తంగానే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కొండకోనల్లో వెలిశాడు. తాను ఉన్న చోటే..

Sri Ketaki Sangameshwara Temple: శివయ్యని బ్రహ్మదేవుడే మొగలి పువ్వులతో పూజించిన క్షేత్రం.. ఇక్కడ కుండంలో స్నానంచేస్తే చర్మ వ్యాధులు దూరం అంటూ నమ్మకం
Surya Kala
|

Updated on: Jan 11, 2021 | 6:41 PM

Share

Sri Ketaki Sangameshwara Temple: శివశివా అంటూ మనసారా తలచుకుంటూ.. జలంతో అభిషేకించినా కోరిన కోర్కికలు తీర్చే భోళాశంకరుడు.. శివుడు. దేశ వ్యాప్తంగానే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాల్లో కొండకోనల్లో వెలిశాడు. తాను ఉన్న చోటే పుణ్యక్షేత్రం అంటూ జంగమయ్య పూజలందుకుంటున్నాడు. అలాంటి శైవ క్షేత్రాల్లో ఒకటి ఝరాసంగం. ఇది తెలంగాణలో అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటి. జహిరాబాద్ కు 16 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో మహాదేవుడు కేతకీ సంగమేశ్వరుడుగా పూజలను అందుకుంటున్నాడు శివయ్య.

స్థల పురాణం:

ఝరాసంగ క్షేత్రంలో శివ లింగాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. కృత యుగంలో సూర్య వంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు చర్మ వ్యాధితో బాధ పడుతూ ఉండేవాడు. తన వ్యాధి నివారణకు రాజు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఒకానొకప్పుడు రాజు ఈ ప్రాంతానికి వచ్చి నపుడు ఇక్కడున్న కేతకీ వనంలో ఉన్న నీటి గుండంలో స్నానం చేసినపుడు అతనికి పూర్తిగా స్వస్థత చేకూరిందట. అదే రోజు రాత్రి రాజుకి సంగమేశ్వర స్వామి కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడట. అక్కడున్న నీటి కుండాన్ని పుష్కరిణిగా మార్చి దానికి అష్ట తీర్ధ మని, అమృత కుండంగా పేరు పెట్టినట్లు ఇక్కడి ఆదారాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించిన భక్తులు అపూర్వమైన ఆధ్యాత్మికానందానికి లోనవుతారు.

మంజీర నదీతీరంలో వెలసిన ఈ స్వామిని సంగమేశ్వర స్వామి అని పిలుస్తారు. కేతకీ సంగమేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఈ స్వామిని మొదట బ్రహ్మదేవుడు కేతకీ పుష్పాలతో కేతకి అంటే మొగలి పువ్వులతో పూజించాడట. అందుకనే ఈ స్వామిని కేతకీ సంగమేశ్వర స్వామి అని కొలుస్తున్నారు భక్తులు అని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.

ప్రచారంలో మరో పురాణ గాధ:

స్థల పురాణానికి సంబంధించి మరో పురాణ గాధ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం కేతకీ అనే అప్సరస ఓ ముని శాపంతో కేతకీ మొగలి వనంగా మారిందట. దీంతో శాప విమోచనాన్ని కోరి ఆమె శివుడ్ని గురించి ఘోర తపస్సు చేయగా… ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఇక్కడ బాన లింగ రూపంలో వెలిశాడట. ఆ కారణంగా ఆ స్వామి కేతకీ సంగమేశ్వర స్వామిగా పూజాధికాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే సృష్టి అనంతరం బ్రహ్మదేవుడు.. శివుడిని కేతకీ పుష్పాలతో ఆరాధించాడట. ఆ కారణంగా ఈ స్వామికి కేతకీసంగమేశ్వర స్వామి అనే పేరొచ్చిందంటారు. ప్రధానాలయానికి వెనుక భాగంలో అమృత కుండం దర్శనమిస్తుంది. ఈ కుండంలో స్నానం చేసే వారి చర్మ రుగ్మతలన్నీ పోతాయని భక్తుల విశ్వాసం. అలాగే కాశీలోని గంగానదిలోని ఓ ఝర ఇక్కడ నీటికుండంలో అంతర్లీనంగా కలుస్తుందంటారు. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవ శోభను స్వయంగా చూడాలే కానీ వర్ణింప శక్యం కాదు.

Also Read: దేవసేనుడే స్వయంగా పాముగా తపస్సు చేసిన ప్రాంతం, సర్పదోష నివారణకు మహిమానిత్వ క్షేత్రం