ఏవీ..! రుతుపవనాలు ఎక్కడ..?
ఖరీఫ్ కాలం ప్రారంభమైనా వరుణుడు మత్రం కనికరించడం లేదు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 11, 12 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపినా.. అరేబియా సముద్రంలోని అల్పపీడనం కారణంగా వర్షాలకు బ్రేక్ పడింది. దీంతో.. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఆలస్యం అవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు తెరుచుకోనుండగా, ఇంకా వడగాడ్పులు వీస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. […]
ఖరీఫ్ కాలం ప్రారంభమైనా వరుణుడు మత్రం కనికరించడం లేదు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 11, 12 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపినా.. అరేబియా సముద్రంలోని అల్పపీడనం కారణంగా వర్షాలకు బ్రేక్ పడింది. దీంతో.. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఆలస్యం అవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు తెరుచుకోనుండగా, ఇంకా వడగాడ్పులు వీస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతవారంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గినా, ఆ వెంటనే తిరిగి పెరగడంతో తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు.