షోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. అవనీరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో జవాన్లు కూంబింగ్ చేపట్టారు. గాలింపు చేపడుతున్న జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదులు తప్పించుకోవడంతో.. వారికోసం వేటాడుతున్నారు. కాగా, సోమవారం పూంచ్​ జిల్లా​లో కాల్పులకు తెగబడ్డాయి పాక్​ బలగాలు. భారత జవాన్లే లక్ష్యంగా మోర్టార్​ బాంబులు విసిరాయి. ఈ దాడిలో ఓ […]

షోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 11, 2019 | 8:04 AM

జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. అవనీరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో జవాన్లు కూంబింగ్ చేపట్టారు. గాలింపు చేపడుతున్న జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో.. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదులు తప్పించుకోవడంతో.. వారికోసం వేటాడుతున్నారు.

కాగా, సోమవారం పూంచ్​ జిల్లా​లో కాల్పులకు తెగబడ్డాయి పాక్​ బలగాలు. భారత జవాన్లే లక్ష్యంగా మోర్టార్​ బాంబులు విసిరాయి. ఈ దాడిలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.