అవినీతిపై కేంద్రం కొరడా.. 12 మంది ఐటీ అధికారుల సస్పెండ్

అవినీతి అధికారులపై కేంద్రం కొరడా ఝలిపించింది. ఏకంగా 12 మంది ఐటీ అధికారులపై వేటు పడింది. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, తోటి మహిళా ఉద్యోగులపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్ ఆదాయపన్ను అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వేటు పడ్డవారంతా సాదాసీదా అధికారులు కాదు… చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులు ఉన్నారు. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం బాధ్యతల నుంచి తొలగిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీ […]

అవినీతిపై కేంద్రం కొరడా.. 12 మంది ఐటీ అధికారుల సస్పెండ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 11, 2019 | 7:48 AM

అవినీతి అధికారులపై కేంద్రం కొరడా ఝలిపించింది. ఏకంగా 12 మంది ఐటీ అధికారులపై వేటు పడింది. అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, తోటి మహిళా ఉద్యోగులపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్ ఆదాయపన్ను అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వేటు పడ్డవారంతా సాదాసీదా అధికారులు కాదు… చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులు ఉన్నారు. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం బాధ్యతల నుంచి తొలగిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలు జారీ చేసింది.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది అధికారులను ఏకకాలంలో వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. బలవంతపు వసూళ్లు చేశారన్న ఆరోపణలపై అశోక్ కుమార్ అగర్వాల్, తోటి మహిళా అధికారులను వేధించారన్న ఆరోపణలపై నోయిడా కమిషనర్ ఎస్.కే శ్రీవాస్తవ, అధికార దుర్వినియోగం, అక్రమార్జన కింద హోమీరాజ్ వంశ్, అవినీతి ఆరోపణలపై అజోయ్ కుమార్, చందర్ భార్తీ, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రాజ్ భార్గవ, రాజేంద్ర ప్రసాద్‌లను బాధ్యతలను తొలగించారు.

నిర్బంద పదవీ విరమణ చేయాల్సిన అధికారులను గుర్తించాలంటూ కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. సెంట్రల్ సర్వీసెస్ 1972 చట్టంలోని నిబంధన 56జే ప్రకారం ఒక అధికారికి 30 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేసే అధికారం ఉంటుంది. పనిచేయని అధికారులపై వేటు వేసేందుకు ఉద్దేశించిన విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధించారు. ఈ మేరకు వీరిపై సమీక్ష నిర్వహించిన సంబంధింత శాఖ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 12మందిపై వేటు వేసినట్లు తెలుస్తోంది.