వివేకా హత్య కేసు: సిట్ అదుపులో జగన్ ముఖ్య అనుచరుడు

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు నాగప్ప, ఆయన కుమారుడు శివను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు కోణాల్లో వీరిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన రాత్రి 11.30గంటల సమయంలో చిన్న అనే […]

వివేకా హత్య కేసు: సిట్ అదుపులో జగన్ ముఖ్య అనుచరుడు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 22, 2019 | 12:02 PM

మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు నాగప్ప, ఆయన కుమారుడు శివను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు కోణాల్లో వీరిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.

చంద్రశేఖర్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన రాత్రి 11.30గంటల సమయంలో చిన్న అనే వ్యక్తికి చెందిన స్కార్పియో వాహనంలో చంద్రశేఖర్ రెడ్డి పులివెందులలో తిరిగినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు కేసు ఒక కొలిక్కి రాగా.. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా అరెస్ట్‌లు ఉండే అవకాశం ఉందని సమాచారం.