సివిల్ సర్వీసెస్ పరీక్షల వాయిదాకు సుప్రీం నిరాకరణ

అక్టోబర్ 4న జరగాల్సిన యూపీఎస్సీ ప్రాథమిక పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలన్న 20మంది యూపీఎస్సీ ఆశావహుల అభ్యర్థనను తోసిపుచ్చింది. 

సివిల్ సర్వీసెస్ పరీక్షల వాయిదాకు సుప్రీం నిరాకరణ
Follow us

|

Updated on: Sep 30, 2020 | 2:10 PM

అక్టోబర్ 4న జరగాల్సిన యూపీఎస్సీ ప్రాథమిక పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలన్న 20మంది యూపీఎస్సీ ఆశావహుల అభ్యర్థనను తోసిపుచ్చింది.  ప్రస్తుతం జరగాల్సిన పరీక్షను 2021 పరీక్షలతో జరపాలన్న వాదనను అత్యున్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ఇలాంటి నిర్ణయాల వల్ల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని  పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖాన్​విల్కర్, జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ కృష్ణమూర్తితో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

అయితే కరోనా కారణంగా పరీక్షకు హాజరుకాలేని  అభ్యర్థులకు మరోసారి ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించడాన్ని పరిశీలించాలని కేంద్రానికి సుప్రీం సూచించింది.  కాగా పరీక్షను వాయిదా వేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని యూపీఎస్సీ గతంలోనే స్పష్టం చేసింది. ఇప్పటికే ఓసారి ఎగ్జామ్ వాయిదా పడినందున మరోసారి అలా చేయడం కుదరదని తేల్చి చెప్పింది. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు యూపీఎస్సీ కోర్టుకు వివరించింది.

Also Read :

టీటీడీ అర్చకునికి 6 నెలల జైలు శిక్ష

వాహనదారులకు అలెర్ట్, అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

Latest Articles
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
తెలంగాణ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ 1st ఇయర్‌ ఉచిత ప్రవేశాలు
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. స్వల్పకాలిక ఎఫ్డీలపై వడ్డీ పెంపు..
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
స్లోగా మారిన ఫోన్‌తో చిరాకు లేస్తుందా.? ఈ ట్రిక్స్‌ ఫాలో అవ్వండి
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!
తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 టాప్‌ 10 ర్యాంకర్లు వీరే.. సత్తాచాటిన ఏపీ!