ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్..

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. తాజాగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవల్లో పలు మార్పులును తీసుకొచ్చింది.

  • Ravi Kiran
  • Publish Date - 9:11 pm, Wed, 28 October 20
ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్..

Good News To SBI Customers: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలతో జనాలను ఆకర్షించే ఎస్‌బీఐ తాజాగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవల్లో పలు మార్పులును తీసుకొచ్చింది. ఇకపై డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చునని తెలిపింది.

కాగా, ఎస్‌బీఐ క్లాసిక్ అండ్ మ్యాస్ట్రో డెబిట్ కార్డు ద్వారా రోజుకు రూ.20,000 విత్ డ్రా.. ఎస్‌బీఐ ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుతో రోజుకు ఏకంగా రూ.లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు. మరోవైపు 2021 జూలై  1 నుంచి బ్యాంక్ సర్వీస్ చార్జీలను ఎస్‌బీఐ సవరించింది. ఈ క్రమంలో వినియోగదారులు నెలకు 8 వరకు ఉచితంగా ఏటీఎం ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చు. అలాగే రూ. 10 వేలు అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నిర్వహించిన వారి ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..