పాంగాంగ్ సరస్సు వద్ద అంతా ఖాళీ, వెనక్కి పూర్తిగా మళ్ళిన చైనా దళాలు, శాటిలైట్ ఇమేజీల్లో చిత్రాలు
లడాఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద చైనా సేనల జాడ కనబడడంలేదు. వారి శిబిరాలు, మిలిటరీ శకటాలు, జెట్టీలు అన్నీ ఏవీ కనిపించడం లేదు.
లడాఖ్ లోని పాంగాంగ్ సరస్సు వద్ద చైనా సేనల జాడ కనబడడంలేదు. వారి శిబిరాలు, మిలిటరీ శకటాలు, జెట్టీలు అన్నీ ఏవీ కనిపించడం లేదు. ఇక్కడ పూర్తి స్థాయిలో చైనా దళాల ఉపసంహరణ జరిగిందనడానికి తాజా శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఫింగర్-5 ఏరియాలో చైనా పీపుల్స్ ఆర్మీ దళాలు తమ మ్యాపులను కూడా తొలగించాయి.ఫింగర్-4, ఫింగర్-8 వద్ద వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉంచిన శకటాలు ఎప్పుడో వెనక్కి కదిలాయి. అలాగే కట్టిన కట్టడాలను కూల్చివేసిన దృశ్యాలను ఈ ఫోటోలు ప్రతిబింబించాయి. ఈ సరస్సు వద్ద నిలిపి ఉంచిన అధునాతన బోట్లను కూడా చైనా తొలగించింది. మొత్తానికి 5 వేలమంది సైనికులు తిరుగు ముఖం పట్టారని, 200 కు పైగా ట్యాంకులు వెళ్లిపోయాయని తెలుస్తోంది.
అలాగే భారత దళాలు సైతం తమ తమ బేస్ మెంట్లకు తరలి వెళ్లాయి. ఇక 48 గంటల్లోగా కోర్స్ కమాండర్ స్థాయిలో మళ్ళీ చర్చలు జరిగిన అనంతరం ఇతర చోట్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలు కానుంది. గోగ్రా వంటి ప్రాంతాల్లో ఇంకా చైనా బూచి కనబడుతోంది. అయితే క్రమేపీ సాధారణ పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో.. ఇదివరకటి ఉద్రిక్తత మచ్చుకైనా కనబడడంలేదు. మరిన్ని చదవండి ఇక్కడ :
‘మరింత మంది మహిళలు ఇక ధైర్యంగా ముందుకు రావచ్ఛు’, జర్నలిస్ట్ ప్రియా రమణి
రేపు అన్నదాతల ‘రైల్ రోకో’ ఆందోళన, నాలుగు గంటలపాటు రైళ్లను నిలిపేస్తాం, రైతునేత రాకేష్ తికాయత్