Uppena Movie : అద్భుత ప్రేమకావ్యంకోసం కదిలిన బావ రామ్ చరణ్.. ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..
మెగా కాపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ బక్సాఫీస్ బద్దులు కొట్టాడు. యాక్ట్ చేసిన మొదటి సినిమాతోనే రికార్డులు తిరగరాసి.. ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకుపోతున్నాడు.
Uppena Movie : మెగా కాపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్ బక్సాఫీస్ బద్దులు కొట్టాడు. యాక్ట్ చేసిన మొదటి సినిమాతోనే రికార్డులు తిరగరాసి.. ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకుపోతున్నాడు. అందమైన ప్రేమ కావ్యంలా రూపొందిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌కు జోడీగా కొత్త భామ కృతి శెట్టి నటించింది. ఈ సినిమాను సుకుమార్ నిర్మించగా బుచ్చిబాబు సనా డైరెక్టర్ చేశాడు. ఇక ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు.. అందర్నీ మెస్మరైజ్ చేస్తూ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఫిబ్రవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ఉప్పెనలా రికార్డు కొల్లగొడుతూ దూసుకుపోతోంది. మంచి ప్రేమ కావ్యంలా అందరినీ ఆకట్టుకుంటూ.. విడుదలైన అన్ని థియేటర్లో సందడి చేస్తోంది ఈ సినిమా. అందమైన ప్రేమకథగా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఓ అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా విచ్చేసి మెగా మేనల్లుడికి బెస్ట్ విషస్ అందించాడు. చేసిన మొదటి సినిమాతో వైష్ణవ్.. అందరి హీరోల డెబ్యూ కలెక్షన్‌లను దాటేసి.. నెంబర్ వన్ గా నిలిచాడు. ఇక ఈ సినిమా కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే సుమారు 30 కోట్లు వసూలు చేసి 50కోట్ల క్లబ్ వైపు దూసుకెళుతోంది. ఒక డెబ్యూ హీరోకి ఇంత వేవ్ రావడం ఇదే తొలిసారి. అయితే ఇంతే వేవ్ ఇప్పుడున్న స్టార్ హీరోలు.. అప్పటి స్టార్ హీరోల వారసుల డెబ్యూ సినిమాకి వచ్చినప్పటికి.. ఇప్పుడా రికార్డులన్నీంటిని ఉప్పెన సినిమా చెరిపేసింది. ఇంతటి ఘనతని ఓ మెగా హీరో చెరిపేయడంతో.. మెగా కాంపౌండ్ మెత్తం ఆనందంలో తేలిపోతుంది.ఇక ఉప్పెన కోసం వైష్ణవ్ తేజ్ భావ మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగంలోకి దిగాడు. ఈ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో టీం ఉప్పెన ఫిబ్ 17న రాజమండ్రిలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.