Seerat Kapoor : ఫిట్నెస్ పైన దృష్టి పెట్టిన అందాల భామ.. సీరత్ సన్నజాజిలా కనపడటానికి కారణం ఇదే అయ్యుంటుందా..
యంగ్ హీరో శర్వానంద్ నటించిన 'రన్ రాజా రన్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ సీరత్ కపూర్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో...
Seerat Kapoor : యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘రన్ రాజా రన్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ సీరత్ కపూర్. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ ‘రన్ రాజా రన్’ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. సీరత్ నటనలోనే కాదు. సింగర్ గాను డ్యాన్సర్ గాను తన ప్రతిభను చాటుకుంటుంది ఈ వయ్యారి. సీరత్ రాజేశ్రీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుండి శిక్షణ పొందిన భారతీయ క్లాసికల్ సింగర్. అంతే కాదు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “రాక్‌స్టార్” సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా కూడా చేసింది.
”రన్ రాజా రన్”, “టచ్ చెసి చుడు”, “రాజు గారి గాది 2”, ‘టైగర్’, “ఒక్క క్షణం”,“ కృష్ణ అండ్ హిజ్ లీలా ”,“ మా వింతా గాధ వినుమా ”వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ అమ్మడు ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. తాజాగా సీరత్ కపూర్ వర్కౌట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో లో ఎలక్ట్రిక్ మ్యూజికల్ స్టిమ్యులేషన్ (ఈఎస్ఎం) ద్వారా వర్కౌట్స్ చేసింది. ఈ మిషన్ పని చేసేటప్పుడు కండరాల ఒత్తిడి మరియు కదలికలను కంట్రోల్ చేస్తుంది. ఇక ప్రతిరోజూ ఈ వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సీరత్ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్ లతో కలిసి నటిస్తుంది సీరత్.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :
Buchi Babu Sana : ప్రేమకథల స్పెషలిస్టుగా మారిన బుచ్చిబాబు.. ‘ఉప్పెన’లా ఎగిసిపడుతున్న ఆఫర్లు..