రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ముంబయి ఇండియన్స్ జట్టు ఫ్యాన్స్‌కు ఇది శుభవార్త. తొడ కండరాలు పట్టివేయడంతో రెండు ఐపీఎల్ మ్యాచుల్లో ఆడలేకపోయిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సడన్‌గా...

  • Rajesh Sharma
  • Publish Date - 7:29 pm, Tue, 27 October 20
రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Rohit Sharma starts net practice:  ముంబయి ఇండియన్స్ జట్టు ఫ్యాన్స్‌కు ఇది శుభవార్త. తొడ కండరాలు పట్టివేయడంతో రెండు ఐపీఎల్ మ్యాచుల్లో ఆడలేకపోయిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సడన్‌గా నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించాడు. సుమారు రెండు గంటల పాటు ట్రైనింగ్ సెషన్‌లో బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ. అయితే అతనికి అయిన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడా లేడా అన్న ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. తొడ కండరాలు పట్టివేసిన నేపథ్యంలో అతనికి విశ్రాంతినివ్వాలని భావించిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన ఆస్ట్రేలియా టూర్ జట్ల ఎంపికలో అతన్ని పక్కన పెట్టేసింది. దాంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ టోర్నమెంటులో మిగిలిన మ్యాచుల్లో రోహిత్ ఆడతాడా లేదా అన్నది సందేహంగా మారింది.

ముంబయి ఇండియన్స్ జట్టు ప్రస్తుతం కీలక దశలో వుంది. 14 పాయింట్లతో కొనసాగుతున్న ముంబయి జట్టు మరో మూడు మ్యాచులు ఆడాల్సి వుంది. వాటిలో రోహిత్ ఆడకపోతే జట్టు విజయావకాశాలపై పెను ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో అటు జట్టు యాజమాన్యంతోపాటు.. టీమ్ కొలీగ్స్, ముంబయి ఇండియన్స్ జట్టు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కీలకదశలో రోహిత్ శర్మ ఆడకపోతే ఇబ్బందేనని క్రికెట్ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ సోమవారం రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో రోహిత్ బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేశాడు. రోహిత్ శర్మ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలను ముంబయి జట్టు ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌లలో రోహిత్ ఆడేది లేనిది ఇంకా తేలనప్పటికీ.. అతని ఫ్యాన్స్ మాత్రం తమ హిట్ మ్యాన్ తప్పక ఆడతాడని విశ్వసిస్తున్నారు.

Also read: ఆనందనిలయం దాటనున్న శ్రీవారు.. టీటీడీ కీలక నిర్ణయం

Also read: సెకెండ్‌వేవ్ కరోనా మరింత డేంజర్.. వైద్యవర్గాల వార్నింగ్

Also read: ఇండియా, అమెరికా ‘బెకా‘ డీల్… హైలైట్స్ ఇవే

Also read: తెలంగాణకు రెండు భారీ పెట్టుబడులు

Also read: వికారాబాద్ అడవుల్లో కాల్పుల కలకలం

Also read: ధోనీ అభిమానులకు శుభవార్త.. సీఎస్కే కీలక ప్రకటన

Also read: కాబూల్‌లో బాంబ్ బ్లాస్ట్