సీబీఐ సమన్లు అందుకునే ముందు రియా..

సీబీఐ విచారించడం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. సుశాంత్‌ మరణం వెనుక గల..

  • Sanjay Kasula
  • Publish Date - 8:35 pm, Fri, 28 August 20
సీబీఐ సమన్లు అందుకునే ముందు రియా..

సీబీఐ విచారించడం పట్ల తనకెంతో సంతోషంగా ఉందని సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ప్రకటించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. సుశాంత్‌ మరణం వెనుక గల అసలు కారణాలేమిటో తాను కూడా తెలుసుకోవాలనుకుంటున్నానన్నారు. జూన్‌ 8న తాను సుశాంత్‌ ఫ్లాట్‌ను వీడిన నాటి నుంచి జూన్‌ 14 వరకు మధ్యకాలంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందని, ఆ సమయంలో సుశాంత్‌ సోదరి అక్కడే ఉన్నారని చెప్పుకొచ్చారు.

కాగా సుశాంత్‌ మృతి కేసులో సీబీఐ సమన్లు అందకోక మునుపు రియా ప్రముఖ జాతీయ మీడియాకు లైవ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు, వదంతుల కారణంగా కుటుంబం ఎంతో వేదన అనుభవిస్తోందని.. అందుకే ఇన్నాళ్ల తర్వాత తాను మౌనం వీడాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే సమన్లు అందుకున్న తర్వాత ఆమె తీరులో మార్పు కనిపించింది. కొంత అసహనం… ఆందోళన ఆమెలో  కొట్టొచ్చినట్లుగా కనిపించాయి.