కరీంనగర్‌ను వణికిస్తున్న కరోనా

కరీంనగర్‌ పట్టణంతో పాటు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం, కంటైన్‌మెంట్‌లతో కరోనా బాధిత కుంటుంబాలు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నాయి. పాజిటివ్‌ వ్యక్తులకు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు...

కరీంనగర్‌ను వణికిస్తున్న కరోనా
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 28, 2020 | 9:16 PM

కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేసులసంఖ్య 6,000కు చేరుకున్నాయి. ఇందులో 2,300 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 3500 మంది కోలుకున్నారు. 74మంది మృతిచెందారు. ప్రభుత్వాసుపత్రిలో 82మంది చికిత్స పొందుతుండగా, శాతవాహన యూనివర్శిటీ ఐసోలేషన్‌లో 93మంది ఉన్నారు. ప్రతిమ ఆస్పత్రిలో 57, చల్మెడలో 73, వారాహిలో 26, సీవీఎంలో 31, మెడికవర్‌లో 5, శరణ్యలో 5, ఇతర ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న వారు 65మంది ఉన్నారు.

ప్రతి రోజు 500కు తక్కువ కాకుండా ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ రూపంలో శాంపిల్స్‌ తీసుకుని టెస్టులను నిర్వహిస్తున్నారు వైద్య అధికారులు. పాజిటివ్‌లతో పోలిస్తే మరణాలు తక్కువగా ఉండడంతో పాటు వైరస్‌ బారిన పడినవారు త్వరగా కోలుకుంటుండడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. కరీంనగర్‌ పట్టణంతో పాటు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం, కంటైన్‌మెంట్‌లతో కరోనా బాధిత కుంటుంబాలు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నాయి. పాజిటివ్‌ వ్యక్తులకు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు.

తక్కువగా పాజిటివ్  కేసులు ఉన్నప్పుడు కట్టుదిట్టమైన చర్యలతో కరోనాకు అడ్డుకట్ట వేసినా… లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ జిల్లా యంత్రాంగానికి సవాలుగా మారుతున్నాయి. కాంటాక్టుల సంగతి దేవుడెరుగు కేసులను ట్రేస్‌చేయడం కూడా వైద్యాధికారులకు కత్తిమీద సాములా మారుతోంది.  కరీంనగర్‌ పట్టణంతో పాటు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం, కంటైన్‌మెంట్‌లతో కరోనా బాధిత కుంటుంబాలు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నాయి. పాజిటివ్‌ వ్యక్తులకు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు భయంతో వణికిపోతున్నారు.