Tadipatri Fight : గొడవ యాడ మొదలైంది..తాడిపత్రి ఎందుకు కుతకుతలాడుతుంది..బీజం పడ్డది ఆడే సామి
తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకుంది.

తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకుంది. అన్ని సెంటర్లతో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. అసలు ఈ వివాదం ఎందుకు రాజుకుంది..? ఎక్కడ ఈ గొడవకు బీజం పడింది…? ఒక ఆడియో ఇంత పెద్ద గొడవకు కారణమైందా..? పాయింట్..పాయింట్….మీ కోసం.
- వివాదానికి కారణం ఇసుక అక్రమ వసూళ్లుపై వచ్చిన ఆడియో
- పెద్దారెడ్డి సతీమణి ఒక ఎడ్ల బండి ఇసుకకు రూ. 10 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణ
- ఓ కాంట్రాక్టర్, ఓ ఎద్దులబండి యజమాని మధ్య ఫోన్ సంభాషణ
- ఇసుక తేవాలని ఎద్దులబండి యజమానిని కోరిన కాంట్రాక్టర్
- ఎమ్మెల్యే భార్య బండి ఇసుకకు రూ. 10 వేలు తీసుకుంటోంది..రూ.10 వేలు కట్టి ఇసుక ఇవ్వలేమని ఎద్దులబండి యజమాని సంభాషణ
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వారి సంభాషణ
- ఈ ఫోన్ సంభాషణ ఆడియోను టీడీపీ మద్దతుదారు వలీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని ప్రచారం… ఆరా తీసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
- అనుచరులతో కలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి…వలీ కోసం జేసీ ఇంట్లో గాలింపు
- అప్పుడు ఇంట్లో లేని జేసీ ప్రభాకర్‌రెడ్డి
- జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు కిరణ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడి
- జేసీ కుర్చీలో కూర్చున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి
- ఎమ్మెల్యే అనుచరులు చేతిలో వేటకొడవళ్లు, కర్రలు. సీసీ ఫుటేజీల్లో రికార్డు
- సమాచారం తెలుసుకుని జేసీ ఇంటికి చేరిన జేసీ వర్గీయులు
- పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు
- దాడుల్లో పగిలిన జేసీ ఇంటి కిటికీల అద్దాలు
- ఇరువర్గాలకు చెందిన పలు వాహనాల అద్దాలు ధ్వంసం
- జేసీ, ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గాల మధ్య బాహాబాహీ
- అప్పుడు హైదరాబాద్ ప్రయాణంలో ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి
- పెద్దారెడ్డి వర్గీయులు వచ్చిన సంగతి చెప్పిన జేసీ భార్య
- మార్గమధ్యలోనే వాహనాలను తిప్పి తాడిపత్రికి చేరిక
- ఈలోపే జేసీ, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య రాళ్ల దాడి
- జేసీ ఇంటి సమీపంలో ఉన్న పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి వర్గం
- ఇరు వర్గాల మధ్య ఘర్షణ, రాళ్ల దాడులు
- రంగంలోకి దిగి వారిని చెదరగొట్టిన పోలీసులు
- పెద్దారెడ్డి ఇంటికెళ్లేందుకు జేసీ వర్గీయుల ప్రయత్నం
- అడ్డుకుని వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు
- పెద్దారెడ్డిపై కేసు పెట్టేది లేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
- దాడికి కాదు..మాట్లాడేందుకే వెళ్లానన్న పెద్దారెడ్డి
- తాడిపత్రిలో 144 సెక్షన్ విధింపు
- ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసీ ఇళ్ల వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు
- దాడులకు పాల్పడ్డ టీడీపీ, వైసీపీ వర్గాలను వీడియో ఆధారంగా గుర్తించే ప్రయత్నం
- దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన టీడీపీ
Also Read :
Manchu Manoj : ముంచువారబ్బాయి..15 కిలోల బరువు తగ్గాడు..సోషల్ మీడియాలో వైరలవుతోన్న నయా లుక్
Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్
Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది
Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ




