RBI Alert: మీరు పాత నాణేలు, కరెన్సీ నోట్లను విక్రయిస్తున్నారా..? జాగ్రత్త.. ఆర్బీఐ చెబుతున్నదేంటో తెలుసుకోండి..!
RBI Alert: కరెన్సీ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇక పాత నాణేలు, కరెన్సీ నోట్లను కొనడం..

RBI Alert: కరెన్సీ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇక పాత నాణేలు, కరెన్సీ నోట్లను కొనడం, అమ్మడం అనే అలవాటు ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. చాలా మంది పాత నోట్లు, పురాతన నాణేలను సేకరించి పెద్ద మొత్తంలో సంపాదించుకుంటున్నారు. కొన్ని ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు, ప్రభుత్వం అప్పుడప్పుడు వేలం నిర్వహిస్తోంది. ఈ వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరానా ప్రకటిస్తోంది ఆర్బీఐ. మీ వద్ద పాత నోటు ఉంటే మీకు అదృష్టం వరించినట్లే అప్పుడప్పుడు వార్తలు చూస్తుండటంతో చాలా మంది చెల్లుబాటులో లేని నాణేలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా విక్రయించి పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. అయితే ఇలా పాత నాణేలు, కరెన్సీ నోట్లను ట్రేడ్ చేసే వ్యక్తులను అలర్ట్చేస్తూ ఆర్బీఐ తాజాగా ప్రకటన జారీ చేసింది.
ఆన్‌లైన్ మోసాలు.. కొందరు సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాత నోట్లు, నాణేలు విక్రయించే క్రమంలో సెంట్రల్ బ్యాంకు పేరు, లోగోను వాడుకుంటున్నారు. మీరు కూడా మీ పాత నాణేలు, నోట్లను విక్రయించడానికి లేదా కొనడానికి రెడీ అవుతున్నట్లయితే ముందుగా ఆర్బీఐ నియమ నిబంధనలపై అవగాహన పెంచుకోవడం మంచిది. లేదంటే సైబర్‌నేరగాళ్ల చేతిలో చిక్కి పెద్ద మొత్తంలో నష్టపోతారు.. అని ఆర్బీఐ ట్వీట్ చేసింది.
ఆర్బీఐ ఏం చెబుతోంది..? ఆర్బీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసిన ఒక ట్వీట్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు, లోగోను కొంత మంది ఉపయోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. చెల్లుబాటులో లేని పాత నాణేలు, పాత నోట్లను విక్రయిస్తూ.. ప్రజల నుంచి ఫీజులు లేదా కమీషన్లు, పన్నులు వసూలు చేస్తున్నారు. ఆర్బీఐ ఎప్పుడూ ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అటువంటి లావాదేవీల కోసం ఎవరి నుండి ఎటువంటి ఫీజు లేదా కమీషన్ కూడా వసూలు చేయడం లేదు. వీటి విక్రయాలను నిర్వహించే బాధ్యతను కూడా ఏ సంస్థకు లేదా వ్యక్తికి ఇవ్వలేదు. పాత నాణేలను కొనుగోలు చేసే క్రమంలో జాగ్రత్త వహించండి. ఒకవేళ, ప్రభుత్వం పాత నాణేల కోసం ఈ-వేలం నిర్వహిస్తే నోటిఫికేషన్ద్వారా తెలియజేస్తుంది అని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
