Huzurabad By Election Result: హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం.. తొలి రౌండ్‌లో ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
హుజురాబాద్ ఉప ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. తొలి రౌండ్ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర దూకుడు మీదున్నారు. హుజురాబాద్
Huzurabad By Poll Result Counting: హుజురాబాద్ ఉప ఎన్నికల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. తొలి రౌండ్ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర దూకుడు మీదున్నారు. హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట్ పోలింగ్ స్టేషన్‌లో తొలి రౌండ్ సాగింది. ఇదులో కమలం అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీజేపీకి 4610, టీఆర్ఎస్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ 119 ఓట్లు వచ్చాయి.
పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం తెలంగాణలో ఉత్కంఠగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్ 32, చెల్లనవి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్‌బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 8 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ 8.30 వరకూ కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి: Huzurabad By Election Result Live Counting: మొదటి రౌండ్‌లో బీజేపీకి ఆధిక్యం..
Petrol Diesel Price: ధన్‌తేరస్ రోజు తగ్గని పెట్రోల్ ధరలు.. మీ నగరంలో ఈ రోజు..