ముంబైకి పొంచిఉన్న వానగండం.. రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్

దేశ ఆర్థిక రాజధాని ముంబై గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉపిరి పీల్చుకోలేక పోతోంది. అటు అధికారులు మాత్రం మరో వాన గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

ముంబైకి పొంచిఉన్న వానగండం.. రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 15, 2020 | 7:10 AM

దేశ ఆర్థిక రాజధాని ముంబై గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉపిరి పీల్చుకోలేక పోతోంది. అటు అధికారులు మాత్రం మరో వాన గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. గురువారం ముంబైతో పాటు మహారాష్ట్రలో భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలోని ముంబైతోపాటు థానే, పూణే, షోలాపూర్, ఉత్తర కొంకణ్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలతో ముంబై నగరంలోని పలుప్రాంతాలు నీటమునిగాయి.

షోలాపూర్ జిల్లాలో బుధవారం భారీ వర్షాల ధాటికి ఆరుగురు ప్రాణాలను కోల్పోయారు. పూణే జిల్లా నింగాన్ కేట్కీ గ్రామంలో వరదనీటిలో చిక్కుకున్న 40మందిని సహాయ సిబ్బంది కాపాడారు. ఇందాపూర్ లో మరో ఇద్దరు వరదనీటిలో కొట్టుకుపోతుండగా సిబ్బంది కాపాడారు. ముంబైలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావద్దని బీఎంసీ అధికారులు సూచించారు.