సరుకులు డెలివరీ ఇవ్వాలంటూ తీసుకెళ్లి.. యువతిపై పాస్టర్ లైంగికదాడి..
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన కామాంధులకు మాత్రం కళ్లెం పడటంలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టంతో నిందితులను కఠినంగా శిక్షలు విధిస్తుంది. కానీ, నేరాలు ఏమాత్రం ఆగడం లేదు.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన కామాంధులకు మాత్రం కళ్లెం పడటంలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టంతో నిందితులను కఠినంగా శిక్షలు విధిస్తుంది. కానీ, నేరాలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ పాస్టర్ తన కుమర్తెను బెదిరించి అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి ఆరోపించింది. సోమవారం స్పందనలో అదనపు ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన బాధిత యువతి(20) పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలను తల్లి బుధవారం ఆస్పత్రి వద్ద మీడియాకు వెల్లడించారు. ‘తిరుపతిలో పాస్టర్‌గా పనిచేస్తునన దేవసహాయంకు చెందిన రెయిన్‌బో క్లినిక్ ప్రాడక్ట్ కంపెనీలో యువతి గత నెల 4వ తేదీన పనికి చేరింది. ఈనెల 3న సాయంత్రం పాస్టర్ కారులో వచ్చి సరకు డెలివరీ ఇవ్వాలి రమ్మని పిలిచాడు. రేణిగుంట సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దిశ పోలీసుస్టేషన్‌కు వెళితే.. ‘అంత పెద్దవారితో నువ్వు పోరాడలేవు.. సిమ్ మార్చేసి మరో పని చేసుకోమని’ పోలీసులు ఉచిత సలహా ఇచ్చారు’ అని బాధితురాలి తెలింది.
దీంతో తన కూతురికి న్యాయం చేయండంటూ సోమవారం అదనపు ఎస్పీ సుప్రజకు స్పందనలో ఫిర్యాదు చేసింది బాధితురాలు తల్లి. దీంతో ఆమెను గాజులమండ్యం పీఎస్‌కు పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.