సానియా మీర్జా పోస్ట్ంగ్స్ పై నెటిజన్లు ఫైర్

సానియా మీర్జా పోస్ట్ంగ్స్ పై నెటిజన్లు ఫైర్

భారత్, పాక్‌ల మధ్య ఏ చిన్న విషయం జరిగినా… ఆ ప్రభావం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై పడుతుంది. క్రికెట్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయినా… పాక్ చేతిలో భారత్ ఓడినా… సానియా మీర్జాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలెడతారు నెటిజన్లు. కారణం అందరికీ తెలిసిందే పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా పెళ్లి చేసుకోవడమే. పాక్ దేశస్థుడిని పెళ్లాడిన తర్వాత కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోన్న ఈ టెన్నిస్ స్టార్… […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 7:58 PM

భారత్, పాక్‌ల మధ్య ఏ చిన్న విషయం జరిగినా… ఆ ప్రభావం భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై పడుతుంది. క్రికెట్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయినా… పాక్ చేతిలో భారత్ ఓడినా… సానియా మీర్జాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ మొదలెడతారు నెటిజన్లు. కారణం అందరికీ తెలిసిందే పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను సానియా మీర్జా పెళ్లి చేసుకోవడమే. పాక్ దేశస్థుడిని పెళ్లాడిన తర్వాత కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోన్న ఈ టెన్నిస్ స్టార్… మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడింది. తాజాగా ట్రోలింగ్ కు గురికావడానికి కారణం సోషల్ మీడియాలో తన ఫోటోలు పెట్టడం. ఫోటోలు పెట్టడంలో తప్పులేదు కానీ.. ఓ వైపు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీరజవాన్లను గుర్తుచేసుకోకుండా.. తన మోడలింగ్ కు సంబంధించిన ఫోటోలను అప్ లోడ్ చేసింది. అంతే.. నెటిజన్లు సానియా తీరుపై దుమ్మెత్తిపోశారు.

ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులైనారు. ఈ దారుణ సంఘటనపై దేశంమొత్తం స్పందిస్తుంటే.. అలాంటి సమయంలో సానియా మీర్జా తనకొత్త డ్రెస్ ను చూపిస్తూ ఇన్ స్టా గ్రాంలో ఫోటో చేసింది. పింక్ అండ్ వైట్ కలర్ లో డిజైన్ చేసిన డ్రెస్ వేసుకుని.. ఫోటోలను పోస్ట్ చేసిన వెంటనే సానియాకు సోషల్ మీడియా ట్రోలింగ్ ఎఫెక్ట్ మొదలైంది. ఓ పక్క దేశంలో దారుణ ఉగ్రదాడి జరిగింది. భారత సైనికులు ప్రాణాలు కోల్పోతే.. దాని గురించి స్పందించకుండా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తావా అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు.

ట్రోలింగ్ మొదలైన అనంతరం తేరుకున్న సానియామీర్జ.. పుల్వామా ఘటన గురించి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పుల్వామా ఘటనపై తెలిసి బాధపడ్డా.. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ప్రపంచంలో టెర్రరిజానికి చోటు లేదు… శాంతి కోసం ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విట్ చేసింది. అయినా కూడా సానియాను నెటిజన్లు వదల్లేదు. త్వరలోనే పాకిస్థాన్‌ ప్రపంచపటం నుంచి మాయమవుతుంది. నువ్వు, నీ కుటుంబంతో కలిసి ఇండియాలో ఉండొచ్చు అంటూ కామెంట్లు చేశారు.

అయితే సానియా మీర్జాకు ఈ విధమైన ట్రోలింగ్ కొత్తేమీ కాదు. కొన్నాళ్ల కిందట ఇండియా- పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సమయంలో ట్రోలింగ్ గురించి ముందే గ్రహించిన సానియా.. తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ డీ-యాక్టివేట్ చేసేసింది. మ్యాచ్ ముగిసిన రెండు రోజుల తర్వాత గానీ రీ-యాక్టివేట్ చేయలేదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu