అమర జవాన్ల కుటుంబాల బాధ్యత మేముతీసుకుంటాం : రిలయన్స్ ఫౌండేషన్
రిలయన్స్ ఫౌండేషన్.. ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ అండగా ఉండే సంస్థ. అలాంటి సంస్థ ఇప్పుడు తన బాధ్యతగా మరోసారి ముందుకొచ్చింది. ఈసారి పుల్వామా బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సిద్ధమైంది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించింది. అమరుల కుటుంబంలోని పిల్లల చదువులు, వారి ఉద్యోగ బాధ్యతలు మేము తీసుకుంటామని హామీ ఇచ్చింది. వారి జీవనోపాధికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది. ఇంతటితోనే తాము ఆగిపోబోమని, రిలయన్స్ […]
రిలయన్స్ ఫౌండేషన్.. ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ అండగా ఉండే సంస్థ. అలాంటి సంస్థ ఇప్పుడు తన బాధ్యతగా మరోసారి ముందుకొచ్చింది. ఈసారి పుల్వామా బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సిద్ధమైంది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించింది. అమరుల కుటుంబంలోని పిల్లల చదువులు, వారి ఉద్యోగ బాధ్యతలు మేము తీసుకుంటామని హామీ ఇచ్చింది. వారి జీవనోపాధికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది. ఇంతటితోనే తాము ఆగిపోబోమని, రిలయన్స్ ఫౌండేషన్ సహకారం ఎక్కడ అవసరం అని ప్రభుత్వం భావిస్తే, తాము అక్కడ సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ప్రకటించింది.
సైన్యానికి, ప్రభుత్వానికి తమ సాయం అవసరమైనప్పుడు వారికి సహకారం అందిస్తామని ప్రకటించింది. గాయపడిన జవాన్లకు తమ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.