60 ఏళ్ల నాసా ప్రయాణాన్ని కళ్లారా చూద్దాం రండి..

60 ఏళ్ల నాసా ప్రయాణాన్ని కళ్లారా చూద్దాం రండి..

ఈ ప్రపంచానికి పూర్తిగా బయటకు వెళ్లిపోదాం.. అక్కడ అంతా పరిశీలిద్దాం.. చక్కర్లు కొడదాం.. ఆశ్చర్యపోయి, అబ్బురపడదాం.. 60 ఏళ్ల నాసా ప్రయాణాన్ని కళ్లారా చూస్తే మనకు చక్కని అనుభూతి కలుగుతుంది. 60 ఏళ్ల క్రితం ఏర్పడిన నాసా చేసిన ప్రయాణంలో సాధించిన ఎన్నో విజయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ అనుభూతిని కలిగించేందుకు 400 ఫొటోలతో నాసా ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని విడుదల చేసింది. అందులో నాసా సాధించిన ఎన్నో విజయాలు, సాధించి చూపించిన అద్భుతాలు కళ్లకు కట్టినట్టు ఉన్నాయి. నాసా […]

Vijay K

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 9:56 PM

ఈ ప్రపంచానికి పూర్తిగా బయటకు వెళ్లిపోదాం.. అక్కడ అంతా పరిశీలిద్దాం.. చక్కర్లు కొడదాం.. ఆశ్చర్యపోయి, అబ్బురపడదాం.. 60 ఏళ్ల నాసా ప్రయాణాన్ని కళ్లారా చూస్తే మనకు చక్కని అనుభూతి కలుగుతుంది. 60 ఏళ్ల క్రితం ఏర్పడిన నాసా చేసిన ప్రయాణంలో సాధించిన ఎన్నో విజయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆ అనుభూతిని కలిగించేందుకు 400 ఫొటోలతో నాసా ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని విడుదల చేసింది.

అందులో నాసా సాధించిన ఎన్నో విజయాలు, సాధించి చూపించిన అద్భుతాలు కళ్లకు కట్టినట్టు ఉన్నాయి. నాసా ప్రయాణం మొత్తంలో ఎన్నో ఫొటోలను తీసిన నాసా అన్నింటినీ తన దగ్గర నిక్షిప్తం చేసుకుంది. అందులో విలువైన వాటిని ఎంచి తన 60వ వార్షికోత్సవం సందర్భంగా పుస్తకం రూపంలో విడుదల చేసింది.

వాటినన్నింటినీ చూస్తే నాసా ప్రయాణాన్ని చూడొచ్చు. సాధించిన విజయాలన్నీ అద్భుతంలా కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. ఈ ఫొటోల్లో స్పేస్ రేస్, స్పేస్ షటిల్ ప్రోగ్రామ్స్‌తో పాటు ప్రముఖ వ్యోమగాముల ఫొటోలు కూడా ఉన్నాయి.

తొలినాళ్ల నుంచి సానా తన ప్రయాణంలో పడిన ఇబ్బందులు, పడిన కష్టాలు, గొప్ప విజయాలను సాధించేందుకు కష్టపడుతూ తీసుకున్న శిక్షణకు సంబంధించిన చిత్రాలు మనల్ని అదేపనిగా చూసేలా చేస్తాయి. అంతరిక్షంలో వ్యోమగాములు చేసిన స్పేస్ వాక్ ఫొటోలు అయితే అబ్బురపరుస్తాయి.

1958, అక్టోబర్ 1వ తేదీన నాసా ఏర్పడింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి సివిలియన్ స్పేస్ ఏజెన్సీ. అయితే అప్పట్లో 1957లో సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసిన స్పుత్నిక్‌కు పోటీగా అమెరికా నాసాను ఏర్పాటు చేసింది.

నాసా తన 60 ఏళ్ల ప్రయాణంలో మార్స్‌పైకి రాకెట్లను పంపించింది. సుదూరంగా ఉన్న పలు గ్రహాల చిత్రాలను అత్యాధునిక కెమేరాల్లో బంధించింది. అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రాయిడ్స్‌ను చూపించింది. చంద్రుని పైకి మనుషులను కూడా పంపించింది. అపోలో – 11లో అల్డ్రిన్, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌లు మొట్టమొదటి సారిగా చంద్రునిపై కాలు మోపి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు నాసా ప్రపంచ దేశాలకు అంతరిక్ష అద్భుతంగా కనిపిస్తూ స్ఫూర్తిని కలిగిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu