రజనీకాంత్ పిక్‌తో ఆస్ట్రేలియా పోలీసుల పాఠాలు
రజనీకాంత్‌ను సూపర్ స్టార్ అనడానికి కారణం ఉంది. భారత చిత్ర రంగాన్ని ఏలుతున్న సూపర్ హీరో. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఆయనకున్న ఫ్యాన్ బేస్ మామూలు విషయం కాదు. తాజాగా ఆయన ఆస్ట్రేలియాలో వైరల్ అయ్యారు. ఆస్ట్రేలియా పోలీసులకు బాగా ఉపయోగపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పాఠాలు చెప్పేందుకు రజనీకాంత్‌ను రిఫరెన్స్‌గా ఆస్ట్రేలియా పోలీసులు వాడుకున్నారు. రజనీ ఇటీవలే నటించిన రోబో 2.0 మూవీలోని ఒక పిక్‌తో డ్రంక్ డ్రైవింగ్ పాఠం […]
రజనీకాంత్‌ను సూపర్ స్టార్ అనడానికి కారణం ఉంది. భారత చిత్ర రంగాన్ని ఏలుతున్న సూపర్ హీరో. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఆయనకున్న ఫ్యాన్ బేస్ మామూలు విషయం కాదు. తాజాగా ఆయన ఆస్ట్రేలియాలో వైరల్ అయ్యారు. ఆస్ట్రేలియా పోలీసులకు బాగా ఉపయోగపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పాఠాలు చెప్పేందుకు రజనీకాంత్‌ను రిఫరెన్స్‌గా ఆస్ట్రేలియా పోలీసులు వాడుకున్నారు.
రజనీ ఇటీవలే నటించిన రోబో 2.0 మూవీలోని ఒక పిక్‌తో డ్రంక్ డ్రైవింగ్ పాఠం చెప్పారు. ఆస్ట్రేలియాలోని దర్బే పోలీసులు వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఫిబ్రవరి 10వ తేదీన రోబో 2.0లోని రజనీ పిక్‌ను వాడుతూ పోస్ట్ చేశారు. మామూలుగా అయితే ఆ పోస్ట్ వైరల్ అయ్యేది కాదేమో, కానీ రజనీ పిక్‌ను వాడటం వల్ల బాగా వైరల్ అయ్యింది. లైక్‌లు, షేర్లు బాగా పెరిగాయి. భారతీయులు దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు.
పలువురు కామెంట్ చేస్తూ రజనీ ఫొటో వాడుకున్నారు కాబట్టే మీ ట్వీట్ వైరల్ అయ్యిందని అంటున్నారు. ఇంతకీ ఆ పోలీసులు ట్వీట్‌లో ఏం చెప్పారంటే.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఒక వ్యక్తిని పరీక్షించగా ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలిందట. సాధారణంగా అనస్తీషియా ఇస్తే ఉండేంత మత్తు ఆ వ్యక్తికి ఉందట.
https://twitter.com/DerbyPol/status/1094338765064101888
అతని BAC 0.341% ఉందని పోలీసులు చెప్పారు. ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయొద్దని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేటర్ చెప్పేటప్పుడు రజనీ ఫొటోను ఆ పోలీసులు వాడుకోవడం వల్ల మనం మన సూపర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. మరి మన రజనీ అంటే మామూలు విషయమా? అందుకే ఆయన సూపర్ స్టార్ ఆఫ్ ది వరల్డ్.