AP Man Died In Australia: ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రకాశం జిల్లా వ్యక్తి..

Prakasham Man Dies In Australia: ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన..

AP Man Died In Australia: ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రకాశం జిల్లా వ్యక్తి..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 28, 2021 | 12:18 PM

Prakasham Man Dies In Australia: ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీష్‌ బాబు (31) గత ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌ రాష్ట్రంలో సల్స్ బరీలో ఉంటున్నాడు. హరీష్‌ బాబు మేనమామ కూతురును వివాహం చేసుకొని కుటుంబంతో సహా ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల భార్య ప్రసవం కోసం పుట్టినిల్లు అయిన ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు వచ్చింది. ప్రసవం తర్వాత ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉన్నా.. విమాన రాకపోకలు లేకపోవడంతో కొన్ని రోజులు ఇండియాలోనే ఉన్న భార్య తాజాగా విమానాలు ప్రారంభంకావడంతో తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న భార్య.. అక్కడి నుంచి భర్త హరీష్‌ బాబుకు ఫోన్‌ చేసింది. అయితే హరీష్‌ ఎంతకీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో ఆస్ట్రేలియాలో ఉన్న బంధువులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో బంధువులు హరీష్‌ ఉన్న ఇంటికి వెళ్లి చూసేసరికి హరీష్‌ మృతి చెంది ఉండడాన్ని గమనించారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఒంటరిగా ఉన్న హరీష్‌ ఎలా చనిపోయాడన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. దేశం కానీ దేశంలో కుమారుడు మృతిచెందడం పట్ల హరీష్‌ తల్లిదండ్రులతో పాటు భార్య విలపిస్తోంది. మృతదేహం స్వగ్రామానికి రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Also Read: తాగి బండి నడిపి అడ్డంగా బుక్కైన మందుబాబులు.. శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా?

Suicide Attempt : భార్యను బెదిరించాలని ఒంటిపై పిచ్చిగా పెట్రోల్ పోసుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!