AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాగి బండి నడిపి అడ్డంగా బుక్కైన మందుబాబులు.. శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా?

వీకెండ్ కావడంతో మందు బాబులుపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

తాగి బండి నడిపి అడ్డంగా బుక్కైన మందుబాబులు.. శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా?
Balaraju Goud
|

Updated on: Feb 28, 2021 | 7:18 AM

Share

Hyderabad drunk and drive cases : వీకెండ్ కావడంతో మందు బాబులుపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎంత మొత్తుకున్నా మందుప్రియలు మాత్రం తమకేమి పట్టదన్నట్లు యధేచ్చగా వ్యవహరిస్తున్నారు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి పది గంటలు నుండి ఉదయం నాలుగు గంటలు వరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. తాగి నడిపినవారిపై కేసులు పెట్టి, వాహనాలను సీజ్ చేశారు. కొద్దిమంది మద్యం సేవించి, రాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడిపారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసి మోతాదు కంటే ఎక్కువ మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు చేశారు.

ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు చేశారు ట్రాఫిక్ పోలీసులు.. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 61 మంది మందుబాబులు పోలీసులకు పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి 19కార్లు, 41 బైకులు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మద్యం తాగి పట్టుబడ్డ వాళ్లందరికి వాళ్ల కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తాం పోలీసులు తెలిపారు. అయితే, పట్టుబడినవారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు, కరోనా కేసులు పెరుగుతుండటంతో నిలిపివేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌ను తిరిగి మొదలు పెట్టారు హైదరాబాద్ పోలీసులు. త‌నిఖీల‌కు సంబంధించి స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రోసిజ‌ర్స్‌ను రూపొందించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇటీవల మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయి. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌ు పెంచినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రధాన ర‌హ‌దారుల్లో త‌నిఖీలు చేపడుతామ‌ని తెలిపారు.

ఇదీ చదవండిః

Horoscope Today: ఈ రాశివారు ఈరోజు వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి… ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఎంట్రెన్స్ టెస్ట్‌లో మార్పులు.. ఎడ్‌సెట్‌ కమిటీ ఆమోదం.. ఆగస్టు నెలలో ప్రవేశపరీక్ష..!