AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Newly Married Man Dead: నవ వధువుకు ఊహించని షాక్.. పెళ్లైన కొన్ని గంటల్లోనే వరుడు మృతి ఎక్కడంటే..!

యువతీయువకుడు వధూవరులుగా మారి.. భవిష్యత్ పై ఎన్నో కలలను కంటూ పెళ్లి పీటలు ఎక్కుతారు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు అయినవారందరి మధ్య ఆనందోత్సాహాలతో పెళ్లి పందిరిలో...

Newly Married Man Dead: నవ వధువుకు ఊహించని షాక్.. పెళ్లైన కొన్ని గంటల్లోనే వరుడు మృతి ఎక్కడంటే..!
Surya Kala
|

Updated on: Feb 28, 2021 | 10:24 AM

Share

Newly Married Man Dead:  యువతీయువకుడు వధూవరులుగా మారి.. భవిష్యత్ పై ఎన్నో కలలను కంటూ పెళ్లి పీటలు ఎక్కుతారు. కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు అయినవారందరి మధ్య ఆనందోత్సాహాలతో పెళ్లి పందిరిలో ఒక్కటవ్వుతారు. అలాగే తమిళనాడుకు చెందిన ఓ యువతీ యువకుడు పెళ్ళికి ఇరువర్గాల బంధువర్గం స్నేహితులు హాజరయ్యారు. ఉదయం అందరి సమక్షంలో ఎంతో వైభావంగా పెళ్లి జరిగింది. విందు భోజనాలు ముగిశాయి. అనంతరం పెళ్లి కుమార్తె ఇంటికి పెళ్లి కొడుకు, బంధువులు వెళ్లారు.. నవదంపతులు భవిష్యత్ పై ఎన్నో కలలు కంటూ సంతోషంగా ఉన్నారు.. అయితే పెళ్లి జరిగిన ఇంట్లోనే ప్రాణం పోతుందని ఎవరూ ఊహించలేదు.. అలా అనుకోని ఘటన చోటు చేసుకోవడమే జీవితం అంటే..

ఇంట్లో పెళ్లి సందడి .. ఇంతలో తన ప్రాణం పోతుందని పెళ్లికొడుకు ఊహించలేదు. పెళ్లికి వెళ్లిన బంధువులు తాము వెంటనే పెళ్లి కొడుకు అంత్యక్రియల్లో పాల్లొంటామని అసలు ఊహించిఉండరు. పెళ్లి జరిగిన ఐదు గంటల్లోనె పెళ్లి కొడుకు హఠాత్తుగా ప్రాణాలు వదిలాడు. ఈ విషాద ఘటన తమిళనాడులోని తిరుచ్చి లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఇలాంచెంపూర్ లో నివాసం ఉండే మలైస్వామి తన ఫ్యామిలీ తో సహా కొన్ని ఏళ్ల క్రితమే తిరుచ్చి జిల్లాలోని సమయపురంకు షిప్ట్ అయ్యాడు. అక్కడే నివసిస్తున్నాడు. మలైస్వామికి విఘ్నేశ్వరన్ (27) అనే కుమారుడు ఉన్నాడు.  తన కుమారుడికి సయాల్ గుడి సమీపంలోని అవపిండి మార్కెట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి తో పెళ్లిని నిశ్చయించాడు. ఇరువురికి గురువారం ఉదయం విగ్నేశ్వరన్ కు ఆ యువతితో గ్రాండ్ గా పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి ఇరువురు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ హాజరయ్యారు.

మద్యాహ్నం కల్యాణమండపం నుంచి అవపిండి మార్కట్ ప్రాంతంలోని పెళ్లి కుమార్తె ఇంటికి వధూవరులతో సహా అందరూ వెళ్లారు. వధూవరుల పెళ్లి పూలదండలు పెళ్లి కుమార్తె ఇంటి గుమ్మానికి తగిలించారు. పెళ్లికి వచ్చిన బంధువుల్లో పెళ్లి కుమార్తె ఇల్లు సందడి నెలకొంది.

మరోవైపు నవదంపతులు కోసం ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం విఘ్నేశ్వరన్‌ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి..హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతనిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పెళ్లికొడుకు మరణించడానికి వైద్యులు చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. వివాహం జరిగిన రోజునే వరుడు మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లో విషాధఛాయలు అలుముకున్నాయి.

అంత చిన్న వయసులో గుండె పోటు రావడం.. వెంటనే ప్రాణాలు పోవడం తో అందరూ షాక్ తిన్నారు. నవ వధువు కాళ్ళ పారాణి ఆరకముందే భర్తను కోల్పోవడం దురదృష్టకరమైన ఘటన అని అంటున్నారు. పెళ్లి జరిగిన కొన్ని గంటల్లో పెళ్లి కొడుకు ప్రాణాలు పోవడంతో పెళ్లి జరిగిన ఇంటిలో ఆర్తనాదాలు మొదలైనాయి. పెళ్లికి వచ్చిన వాళ్లు అలాగే విఘ్నేశ్వరన్ అంత్యక్రియలకు హాజరైనారు. పెళ్లి కుమార్తె పెళ్లిపారాణి ఆరకముందే ఆమె పసుపుకుంకాలు దూరం కావడంతో కుటుంబ సభ్యులతో పాటు.. గ్రామంలో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి.

Also Read:

ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రకాశం జిల్లా వ్యక్తి.. భార్య ఫోన్‌కు స్పందించకపోవడంతో..

తాగి బండి నడిపి అడ్డంగా బుక్కైన మందుబాబులు.. శనివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నో తెలుసా?

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..