Watch: కదులుతున్న రైలు ఎక్కుతుండగా పట్టాలపై పడిపోయిన పెంపుడు కుక్క .. ఆ తర్వాత
వీడియోలో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కతో కదులుతున్న రైలు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది. మెడలో బెల్ట్‌తో కట్టబడి ఉన్న కుక్కను పట్టుకుని ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేశాడు. కుక్కను చేతుల్లో ఎత్తుకోకుండా.. దానిని బెల్ట్ పట్టి లాగుతూ రైలును ఎక్కే ప్రయత్నం చేశాడు.. కానీ, పాపం ఆ కుక్క ట్రైన్ ఎక్కలేకపోయింది.

కుక్కలు విశ్వాసపాత్రమైనవే కాదు తెలివైనవి కూడా. అలాంటి కుక్క అదృష్టం బాగుంది.. కదులుతున్న రైలు కిందపడిన తరువాత కూడా అది బతికి బయటపడింది. రైలు కింద పడిన తర్వాత మనిషి కానీ, జంతువు కానీ బ్రతకడం చాలా కష్టం కానీ, ఓ పెంపుడు కుక్క రైలు కింద పడ్డా బతికిపోయింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కతో కదులుతున్న రైలు ఎక్కుతుండగా ప్రమాదం జరిగింది.
వీడియో ఇక్కడ చూడండి..
మెడలో బెల్ట్‌తో కట్టబడి ఉన్న కుక్కను పట్టుకుని ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేశాడు. కుక్కను చేతుల్లో ఎత్తుకోకుండా.. దానిని బెల్ట్ పట్టి లాగుతూ రైలును ఎక్కే ప్రయత్నం చేశాడు.. కానీ, పాపం ఆ కుక్క ట్రైన్ ఎక్కలేకపోయింది. అది పట్టాలపై పడిపోయింది. ఈ ప్రమాదంలో శునకానికి తీవ్ర గాయాలైనట్టుగా తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..